BREAKING : కర్ణాటకలో 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్‌ వేటు

కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ యుటి ఖాదర్  సంచలన నిర్ణయం తీసుకున్నారు.  క్రమశిక్షణారాహిత్యం కారణంగా మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ సిఎన్ అశ్వత్ నారాయణ్ సహా 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలను ఆరు నెలల పాటు సస్పెండ్ చేశారు.

New Update
marshals

కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ యుటి ఖాదర్  సంచలన నిర్ణయం తీసుకున్నారు.  స్పీకర్ పదవిని అగౌరవపరిచినందుకు క్రమశిక్షణారాహిత్యం కారణంగా మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ సిఎన్ అశ్వత్ నారాయణ్ సహా 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలను ఆరు నెలల పాటు సస్పెండ్ చేశారు.  

Also Read :  వారేవా పాకిస్థాన్.. న్యూజిలాండ్కు చుక్కలు చూపించింది!

సస్పెండ్ అయిన బీజేపీ ఎమ్మెల్యేలు భైరతి బసవరాజ్, డా. శైలేంద్ర బెల్దాలే, మునిరత్న, ధీరజ్ మునిరత్న, బిపి హరీష్, డా. భరత్ శెట్టి, చంద్రు లమాని, ఉమానాథ్ కోటియన్, రామమూర్తి, దొడ్డనగౌడ పాటిల్, డా. అశ్వత్ నారాయణ్, యశ్‌పాల్ సువర్ణ, బి. సురేష్ గౌడ, శరణు సలగర, చన్నబసప్ప, బసవరాజ మట్టిముడ, ఎస్ఆర్ విశ్వనాథ్‌లను మార్షల్స్ సభ నుండి బయటకు తీసుకెళ్లారు.

Also Read :  బాగా ఫీల్ అయినట్టున్నాడు... పెళ్లికి పిలువలేదని కాల్చి పారేశాడు!

Also read :  ఉప్పల్‌లో ఐపీఎల్‌ మ్యాచ్‌లు.. రాచకొండ సీపీ కీలక ఆదేశాలు!

ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లపై

హనీ-ట్రాప్ కేసుల అంశం, కాంట్రాక్ట్‌లలో ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లపై బీజేపీ ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు సభలో గందరగోళం సృష్టించి, సభ కార్యకలాపాలకు అంతరాయం కలిగించడమే కాకుండా..  సభలోని వెల్‌లోకి ప్రవేశించి, స్పీకర్ కుర్చీ ముందు కాగితాలను చింపి విసిరారు.  దీంతో స్పీకర్ ఈ చర్య తీసుకున్నారు. 

Also Read :  బాలకృష్ణ షోతో నా జీవితం నాశనం.. రూ.80 లక్షలు పోగొట్టుకున్నా.. నెల్లూరు బాధితుడి సంచలన ఇంటర్వ్యూ!

Advertisment
తాజా కథనాలు