/rtv/media/media_files/2025/03/10/nyBqceWCmCpVwIS3wB1x.jpg)
Gold
GoldRate: బంగారం ధరలు స్థిరంగా ఉండటం లేదు. ఒకరోజు ఆకాశాన్ని తాకితే మరోరోజు తగ్గినట్లు కనిపిస్తోంది, తాజాగాహైదరాబాద్ లో శుక్రవారం 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) 95130 దగ్గర ట్రేడ్ అయింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) 87200 దగ్గర ట్రేడ్ అయింది. ఇక,18 క్యారెట్ల ధర(10 గ్రాములు) 71350 దగ్గర ట్రేడ్ అయింది. గత కొంత కాలంగా బంగార ధరలు తగ్గుతూ వచ్చాయి. దీంతో బంగారం కొనుగోలు దారులు ఎంతో ఆశగా కొనేందుకు ముందుకు వచ్చారు. గత నెలలో పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర లక్షవరకు పలికింది. ఆ తర్వాత ఒక్కసారిగా 93 వేలకు పడిపోయింది. ఇక 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 90 దిగువకు పడిపోయింది. ప్రస్తుతం వివాహశుభకార్యాలకు సమయం కావడంతో బంగారం కొనేందుకు ఔత్సాహికులు పరుగులు తీశారు. మధ్య తరగతి వారు మాత్రం ఇంకాస్తా బంగారం ధర తగ్గితే తీసుకుందామని వేసి చూసే దోరణిలోనే ఉన్నారు. అయితే, వారి ఆశలపై నీళ్లు చల్లుతూ బంగారం ధర మరొకసారి పెరిగింది. భవిష్యత్తులో మరింత పెరుగుతుందని బంగారం వర్తకులు చెబుతున్నారు.
బంగారం ధరలు ..
గత కొంతకాలంగా తగ్గుతూ...పెరుగుతూ వచ్చిన బంగారం ధర మరోసారి పెరిగే దిశగా పరుగులు పెడుతున్నది. ప్రస్తుతం హైదరాబాద్ లో శుక్రవారం రోజున 24 క్యారెట్ల ( స్వచ్ఛమైన10 గ్రాములు) బంగారం ధర 95130 ధర పలికింది. 22 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర 87200 పలికింది. ఇక, 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 71350 గా ఉంది. ఇక, శనివారానికి బంగార ధర మరో కొంత పెరిగింది. 18,22,24 క్యారెట్ల బంగారంపై 10 రూపాయలు పెరిగింది. 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర శనివారం 95140 వరకు చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 87210 ఉంటే 10 గ్రాముల 18 క్యారెట్ల ధర 71360 పలుకుతుంది.
వెండి ధరలు
ఇక వెండిధరల విషయానికి వస్తే హైదరాబాద్ లో వెండిధరలు మాత్రం తగ్గుతూ వస్తున్నాయి. బంగారంతో సంబంధం లేకుండా వెండి ధరలు గతం కంటే తగ్గుతున్నాయి. శుక్రవారం100 గ్రాముల వెండి ధర 10800 రూపాయలు పలికింది. ఇక కేజీ వెండి ధర రూ.1,08000గా ఉంది. శనివారం 100 గ్రాములపై 10 రూపాయలు, కిలో వెండిపై 100 రూపాయలు తగ్గింది. ఈ రోజు 100 గ్రాముల వెండి ధర 10790 లుగా ఉంది. కేజీ బంగారం ధర 1,07,900 లకు చేరుకుంది.