TGSRTC: తెలంగాణ ఆర్టీసీకే టోకరా.. రూ.21 కోట్ల మోసం

గో రూరల్ ఇండియా సంస్థ.. తెలంగాణ ఆర్టీసీ బస్సులపై ప్రకటనల కోసం ఒప్పందం కుదుర్చుకుంది. యాడ్స్ ద్వారా వచ్చిన డబ్బులు ఆర్టీసీ ఇవ్వకుండా నిర్వాహకులు సొంత ఖాతాల్లోకి మళ్లించుకున్నారు. దీంతో TGSRTC రూ.21 కోట్లు మోసపోయినట్లు ఈడీ అధికారులు గుర్తంచారు.

New Update
TGSRTC

TGSRTC

గో రూరల్‌ ఇండియా ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు అటాచ్ చేశారు. ఆ సంస్థకు చెందిన రూ.6.47 కోట్ల విలువైన స్థిరాస్తులను తాత్కాలికంగా జప్తు చేశారు. అయితే ఈ గో రూరల్ ఇండియా సంస్థ.. తెలంగాణ ఆర్టీసీ బస్సులపై ప్రకటనలకు గో రూరల్ ఇండియా సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే యాడ్స్‌ ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఆర్టీసీకి ఇవ్వకుండా వేరే సంస్థలకు ఇచ్చినట్లు ఈడీ అధికారుల దర్యాప్తులో తేలింది.  M/s GRIPL, M/s Poster Town India Pvt Ltd, M/s Go Transit Media Pvt Ltd, M/s Lime Lite Advertising Pvt Ltd లాంటి కంపెనీల ద్వారా వ్యాపారం చేసినట్లు గుర్తించారు.

Also Read: మహా కుంభమేళాకు 50 కోట్ల మంది భక్తులు.. యూపీ సర్కార్ సంచలన ప్రకటన

వినియోగదారుల నుంచి వచ్చిన కోట్లాది రూపాయలను తమ సొంత ఖాతాల్లోకే మళ్లించుకున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు. తెలంగాణ ఆర్టీసీకి ఇవ్వాల్సిన రూ.21.72 కోట్ల బకాయిలను చెల్లించకుండా ఆ డబ్బును వివిధ పెట్టుబడులకు ఉపయోగించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఇంకా ఈ దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు. 

Also Read: పంజాబ్‌కే అక్రమ వలసదారులను అమెరికా ఎందుకు పంపిస్తోంది ?

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు