/rtv/media/media_files/2025/02/14/wTucB3YRjZ5dwT2AsH9T.jpg)
US Military Flight at Amritsar
అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయులను అమెరికా ప్రభుత్వం ప్రత్యేక యుద్ధ విమానాల్లో భారత్‌కు తరలిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విమానాలు పంజాబ్‌లోని అమృత్‌సర్‌కే వస్తున్నాయి. మరీ ఈ విమానాలు అక్కడికే ఎందుకు వస్తున్నాయి. ఢిల్లీ, గుజరాత్, బెంగళూరు ఇతర లాంటి ఇతర ప్రదేశాలకు ఎందుకు వెళ్లడం లేదనే దానిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ అంశం ఇప్పుడు రాజకీయంగా వివాదాస్పదంగా మారింది. అయితే దీనిపై పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్ స్పందించారు.
Also Read: పుల్వామా అటాక్ చేసినవాళ్లను ఇండియన్ ఆర్మీ ఏం చేసిందో తెలుసా?
కేంద్ర ప్రభుత్వం కావాలనే ఆ విమానాలను అమృత్‌సర్‌కు పంపిస్తోందని విమర్శలు చేశారు. పంజాబ్ పేరును చెడగొట్టేందుకే కావాలనే విమానాలను ఇక్కడకు పంపిస్తున్నారని మండిపడ్డారు. శనివారం (ఫిబ్రవరి 15) అమెరికా నుంచి మరో విమానం రానుంది. వాళ్లకి భగవంత్ మాన్ స్వాగతంపలకనున్నారు. ఈ క్రమంలోనే ఆయన అమృత్‌సర్‌కు కూడా చేరుకున్నారు. మరోవైపు కాంగ్రెస్ కూడా భగవంత్ సింగ్ ఆరోపణలకు మద్ధతిస్తోంది. అయితే బీజేపీ ఈ ఆరోపణలను ఖండిస్తోంది.
Also Read: మోదీ బీసీ కాదు.. కేసీఆర్‌కు తెలంగాణలో ఉండే హక్కు లేదు: రేవంత్ సంచలనం!
ఈ విషయాన్ని రాజకీయం చేయడం మంచిది కాదని చెబుతోంది. శనివారంతో పాటు ఆదివారం కూడా మరో విమానం అమెరికా నుంచి రానుంది. ఇప్పటికే అమెరికా నుంచి వచ్చిన తొలి విమానంలో అక్రమంగా ఉంటున్న 104 మంది భారతీయులను వెనక్కి పంపించారు. మరో 600 మందిని తరలించేందుకు అమెరికా సిద్ధమవుతోంది.
Also Read: కేరళలో ఏనుగుల బీభత్సం.. ముగ్గురు స్పాట్ డెడ్.. మరో 36 మంది: వీడియో చూశారా!
Also Read: అదానీ కేసు గురించి అడిగిన అమెరికా మీడియా.. ప్రధాని మోదీ షాకింగ్ రియాక్షన్