Yadagirigutta: యాదగిరిగుట్టలో గిరి ప్రదక్షిణ.. పోటెత్తిన భక్తులు
తెలంగాణలో ప్రసిద్ధి చెందిన యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రానికి భక్తులు పోటెత్తారు. శ్రీనరసింహస్వామి జన్మనక్షత్రం స్వాతి సందర్భంగా శనివారం ఉదయం భక్తులు పెద్ద ఎత్తున దేవాలయానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా గిరి ప్రదక్షిణ జరిగింది.