Earthquake: కాళేశ్వరం ప్రాజెక్టు వల్లే భూకంపం: భూగర్భ శాస్త్రవేత్త

తెలుగురాష్ట్రాల్లో పలుచోట్ల స్వల్ప భూ ప్రకంపనలు రావడం చర్చనీయమవుతోంది. ఈ భూకంపానికి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కూడా ఓ కారణమేనని భూగర్భ శాస్త్రవేత్త బీవీ సుబ్బారావు అన్నారు. వాటర్ స్టోరెజ్‌ వల్ల ఒత్తిడిలో ఇది జరగొచ్చని పేర్కొన్నారు.

New Update
HHHH

తెలుగురాష్ట్రాల్లో పలుచోట్ల స్వల్ప భూ ప్రకంపనలు రావడం చర్చనీయమవుతోంది. బుధవారం ఉదయం 7.27 గంటలకు కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది. దీంతో ఒక్కసారిగా భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్లు, అపార్ట్‌మెంట్ల నుంచి పరుగులు తీశారు. అయితే ఈ భూకంపం సంభవించడానికి గల కారణాలపై భూగర్భ శాస్త్రవేత్త బీవీ సుబ్బారావు సంచలన విషయాలు వెల్లడించారు. ఈ భూకంపానికి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కూడా ఓ కారణమేనన్నారు. 

Also Read: తెలంగాణలో గూగుల్‌ భారీ పెట్టుబడులు.. టోక్యో తర్వాత హైదరాబాద్‌లోనే

'' భూకంపాలకు అనేక కారణాలుంటాయి. ఈ రోజు వచ్చిన భూకంపానికి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కూడా ఓ కారణమే. కాళేశ్వరం పరిసర ప్రాంతమంతా ఎటువంటి నిర్మాణాలకు పనికిరాదని గతంలో కేంద్ర ప్రభుత్వం ఓ మ్యాప్‌ డిజైన్‌ చేసింది. డిజాస్టర్‌కు అనుకూలంగా ఉండే ప్రాంతాల్లో ఎలాంటి నిర్మాణాలు చేయకూడదని చెప్పింది. ప్రాజెక్టులో వాటర్‌ స్టోర్‌ చేయడంతో.. ఆ ఒత్తిడి వల్ల కూడా ఈ భూకంపం రావొచ్చు. కాళేశ్వరం నిర్మాణానికి సంబంధించిన జియో టెక్నికల్‌ రిపోర్ట్‌ కూడా లేదని'' బీవీ సుబ్బారావు వివరించారు. 

Also Read: ఫడ్నవీస్ కే పట్టం.. ఆయనను మళ్లీ సీఎం చేసిన 6 ముఖ్య కారణాలివే!

ఇదిలాఉండగా తెలంగాణలోని ములుగు జిల్లా మేడారంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. దీని తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 5.0గా నమోదైనట్లు హైదరాబాద్‌లోని సీఎస్‌ఐఆర్‌-ఎన్‌జీఆర్‌ఐ శాస్త్రవేత్తలు తెలిపారు. భూకంప కేంద్రం నుంచి 225 కిలోమీటర్ల పరిధి వరకు భూమి కంపించింది. తెలంగాణలో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలు, ఉమ్మడి ఖమ్మం, వరంగల్, రంగారెడ్డి, కరీంనగర్, జనగామా జిల్లాల పరిధిలో ప్రకంపనలు వచ్చాయి. హైదరాబాద్‌లోని వనస్థలిపురం, హయత్‌నగర్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌ పరిసర ప్రాంతాల్లో భూమి కంపించింది. ఇక ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నం, జగ్గయ్యపేట, నందిగామ తదితర ప్రాంతాల్లో భూమి కంపించింది.

Also Read: స్వర్ణ దేవాలయంలో కాల్పులు.. సుఖ్‌బీర్ సింగ్‍పై హత్యాయత్నం

Also Read: 96 రకాల సీతాకోకచిలక జాతులు గుర్తింపు.. ఆ రాష్ట్రంలో గ్రాండ్‌గా ఈవెంట్

Advertisment
Advertisment
తాజా కథనాలు