NIMAJJANAM : వినాయక..వీడ్కోలిక....నిమజ్జనానికి కదలిన గణనాథులు

డప్పు చప్పుళ్లు.. భక్తి గీతాలు.. మహిళల కోలాట నృత్యాలు.. ఒగ్గుడోలు,ధూంధాంతో  భక్తజనం వెంట నడవగా.. నవరాత్రులు ఘనమైన పూజలందుకున్న విఘ్నేశ్వరుడి నిమజ్జన శోభాయాత్ర నగరంలో కన్నుల పండువగా సాగుతోంది. శనివారం వేకువజామునుంచే నిమజ్జనంతో నగరం సందడిగా మారింది.

New Update
Khairatabad Ganesh Live

vinayaka nimajjanam

NIMAJJANAM : డప్పు చప్పుళ్లు.. భక్తి గీతాలు.. మహిళల కోలాట నృత్యాలు.. ఒగ్గుడోలు,ధూంధాంతో  భక్తజనం వెంట నడవగా.. నవరాత్రులు ఘనమైన పూజలందుకున్న విఘ్నేశ్వరుడి నిమజ్జన శోభాయాత్ర నగరంలో కన్నుల పండువగా సాగుతోంది. శనివారం వేకువజామునుంచే నిమజ్జనంతో నగరం సందడిగా మారింది. గణపతి బొప్పా మోరియా, జై బోలో గణేశ్‌ మహారాజ్‌కీ నినాదాలతో నగరమంతా మార్మోగింది.  నగరంలో  గణేష్ నిమజ్జనం కోసం ట్రాఫిక్ పోలీసులు రూట్ మ్యాప్ ప్రకటించారు. సెప్టెంబర్ 6 ఉదయం నుంచి 7వ తేదీ ఉదయం వరకు వాహన రాకపోకలపై నియంత్రణ విధించారు. బాలాపూర్ నుంచి ట్యాంక్‌బండ్ వరకు ప్రధాన శోభాయాత్ర కొనసాగుతుంది. ఖైరతాబాద్ గణపతిని విజయవాడ నుంచి తెప్పించిన ప్రత్యేక టస్కర్ ట్రాలీ ద్వారా హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేయనున్నారు.

ఎంజే మార్కెట్, ఖైరతాబాద్, అబిడ్స్, లిబర్టీ, రాణిగంజ్, తెలుగు తల్లి చౌరస్తా, ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్, పీపుల్స్ ప్లాజా వంటి జంక్షన్లను వాహనదారులు తప్పించుకోవాలి. విమానాశ్రయం వెళ్లేవారు పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే లేదా ఔటర్ రింగ్ రోడ్ మాత్రమే ఉపయోగించాలి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వెళ్ళే ప్రయాణికులు బేగంపేట్–ప్యారడైజ్ రూట్ ఎంచుకోవాలి.భక్తుల సౌలభ్యం కోసం 10 బేబీ పాండ్లు, 8 పోర్టబుల్ వాటర్ ట్యాంకులు, 8 ఎక్స్కవేషన్ పాండ్లు ఏర్పాటు చేశారు. అదనంగా భారీ విగ్రహాల కోసం ప్రత్యేక టస్కర్ ట్రాలీలు, క్రేన్లు, సపోర్టింగ్ వర్క్ టీమ్‌లు సిద్ధంగా ఉన్నాయి. అత్యవసర పరిస్థితుల్లో 040-27852482, 8712660600, 9010203626 నంబర్లను సంప్రదించవచ్చు.

హైదరాబాద్ గణేష్ నిమజ్జనంలో ప్రధాన ఆకర్షణ ఖైరతాబాద్ గణనాథుడే. 69 అడుగుల ఎత్తు, 40–50 టన్నుల బరువు కలిగిన ఈ విగ్రహాన్ని విజయవాడ నుంచి తెప్పించిన 26 చక్రాల టస్కర్ ట్రాలీ మీద నిమజ్జనానికి తరలిస్తున్నారు. శుక్రవారం రాత్రి నుంచి వెల్డింగ్ పనులు, ప్రత్యేక పూజలు పూర్తి చేసి, శనివారం తెల్లవారుజామున హుస్సేన్ సాగర్ వైపు శోభాయాత్ర ప్రారంభం కానుంది.

వినాయక నిమజ్జనంపై  హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్ శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ గణేష్ పండుగ చాలా ముఖ్యమైనదని, సుమారు ఇరవై వేల గణేష్ విగ్రహాలు నిమజ్జనం అవుతాయన్నారు. నిమజ్జనం సాఫీగా జరగడానికి అన్ని విభాగాలతో సమన్వయం చేసుకుంటున్నట్లు చెప్పారు. వినాయక నిమజ్జనం తమకు ఛాలెంజింగ్ అని బందోబస్తు కోసం నెల రోజుల ముందు నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుందని తెలిపారు. రూట్ ఇన్స్‌ఫెక్షన్స్ చేసి ఆయా విభాగాలకు అవసరమైన సూచనలు ముందుగానే చేశామన్నారు. విగ్రహాలు అమ్మే దుల్‌పేట్ లాంటి ప్రాంతాల్లో కూడా ప్రణాళిక బద్ధంగా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

3200 మంది ట్రాఫిక్ సిబ్బంది రెండు షిఫ్ట్‌ల్లో గణేష్ బందోబస్తు విధుల్లో ఉంటారని చెప్పారు. వినాయక నిమజ్జనంకు పది వేల పైగా టస్కర్ వాహనాలు వచ్చే అవకాశం ఉందని ఆయన చెప్పారు. సుమారుగా పది లక్షల మంది భక్తులు నిమజ్జనంలో పాల్గొనే అవకాశం ఉంది అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. ఉదయం ఆరు గంటలకు బడా గణేష్ శోభాయాత్ర స్టార్ట్ అవుతుందని, నాలుగో నెంబర్ క్రేన్ వద్ద 12 గంటలకు కంత నిమజ్జనం పూర్తి అయ్యే అవకాశం ఉందని చెప్పారు. బడా గణేష్ నిమజ్జనం చూడటానికి వచ్చేవారు వ్యక్తిగత వాహనాలు కాకుండా ప్రజా రవాణా వినియోగించాలి అని సూచించారు. నిమజ్జనానికి వచ్చే వాహనాల కోసం ఎన్టీఆర్ స్టేడియం, కట్టమైసమ్మ దేవాలయం, పబ్లిక్ గార్డెన్స్, బుద్దభవన్ వెనుక, ఆదర్శనగర్, బీఆర్కే భవన్, ఖైరతాబాద్ ఎంఎంటీఎస్ స్టేషన్ వద్ద పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

Also Read: 50 వేల విగ్రహాలు.. 30 వేల మంది పోలీసులు.. ఈ సారి నిమజ్జనం ప్లాన్, రూట్ మ్యాప్ ఇదే!

Advertisment
తాజా కథనాలు