గణేశ్ నిమజ్జనోత్సవం.. సీవీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్‌లో వినాయక నిమజ్జనోత్సం సందర్భంగా 25 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని నగర సీపీ సీవీ ఆనంద్ అన్నారు. అలాగే సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు భద్రత ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.
హైదరాబాద్‌లో వినాయక నిమజ్జనోత్సం సందర్భంగా 25 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని నగర సీపీ సీవీ ఆనంద్ అన్నారు. అలాగే సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు భద్రత ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.
నిమజ్జనంలో డ్యాన్స్ తో దుమ్ములేపారు మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. నందమూరి నటసింహం బాలకృష్ణ తన డైలగ్స్ తో అదరగొట్టారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే, ఈ హీరోలు ఎక్కడా డ్యాన్స్ వేశారు అని షాక్ అవుతున్నారా? అమలాపురంలో చిరంజీవి, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ గెటప్స్ తో కొందరు సందడి చేసారు. అయితే, వారిలో తమ రియల్ హీరోస్ ను తలచుకుని ఫాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.
భాగ్యనగర్‌లో గణపయ్య నిమజ్జనానికి ట్రై కమిషనరేట్ల పరిధిలో ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రభుత్వ శాఖల సమన్వయంతో నిమజ్జనం సవ్యంగా సాగేలా పోలీసుల ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది భారీ సంఖ్యలో వినాయక విగ్రహాలను ప్రతిష్టించారు నిర్వాహకులు. బాలాపూర్ గణేష్ మొదలుకుని హుస్సేన్ సాగర్ వరకు 19 కిలో మీటర్ల శోభాయాత్ర కొనసాగనుంది.