/rtv/media/media_files/2025/03/21/VoBxukRa1G241sqh0SLX.jpg)
1 Rupee Food
సికింద్రాబాద్ ఏరియాలో మనోహర్ టాకీస్ సమీపంలో ఉండే.. కరుణ హోటల్ అన్నర్థుల ఆకలి తీరుస్తోంది. పేరుకి తగినట్లుగానే భోజన ప్రియులపై కరుణ చూపిస్తున్నారు. నిజానికి ఇదో స్వచ్ఛంద సంస్థ. ఎలాంటి వారికైనా ఇక్కడ ఒక్క రూపాయికే భోజనం లభిస్తుంది. రోజూ ఉదయం 12 గంటల నుంచి2 గంటల వరకూ ఇక్కడ ఉచితంగా భోజనం పెడతారు. ఇలా రోజూ వందల మంది ఇక్కడ భోజనం చేస్తూ.. ఆకలి తీర్చుకుంటున్నారు. ఈ భోజనం చాలా బాగుందనీ, రుచికరంగా ఉందని మెచ్చుకుంటున్నారు. ఇక్కడ కార్మికులకు నెలన్నర రోజుల నుంచి కేవలం ఒక్క రూపాయికే భోజనం కల్పిస్తూ గుడ్ సమ్మరిటీస్ ఇండియా స్వచ్ఛంద సంస్థ తన దాతృత్వాన్ని చాటుతోంది. ఇక్కడ జార్జ్ రాకేశ్ బాబు ఆధ్వర్యంలో రోజూ మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. నగరానికి వచ్చే వారి ఆకలి తీర్చడంతో ఆ సంతృప్తి వేరేగా ఉంటుందని అతడు చెబుతున్నాడు. ఒక్క రూపాయి కూడా పెట్టడానికి కారణం ఉచిత భోజనం చేస్తున్నాం అనే భావన వారిలో కలగకూడదని, డబ్బులు పెట్టి భోజనం చేస్తున్నామంటే డబ్బులు పెట్టామన్న ఉద్ధేశంతో భోజనంవేస్టు చేయరన్నది నిర్వహాకుల అభిప్రాయం. అందుకే ఇలా ఒక్క రూపాయికి మాత్రమే భోజనం అందిస్తున్నట్లు తెలిపారు.
Also Read: హైకోర్టు జడ్జి వ్యాఖ్యలు బాధాకరం.. మైనర్ బాలిక ఇష్యూపై కేంద్రమంత్రి అసహనం!.
అసలు కరుణ కిచెన్ సంస్థ ఒక రూపాయికే భోజనం ఎందుకు పెడుతోంది అనే డౌట్ మనకు రావచ్చు. దీని వెనక బలమైన ఉద్దేశం ఉంది. ఎవరూ ఆకలితో అలమటించకూడదు అనేది ఈ సంస్థ ఉద్దేశం. సంపన్నులైనా, పేదలైనా ఎవరైనా సరే.. వారికి ఆకలి వేస్తే.. తీర్చడమే తమ ఉద్దేశంగా ఈ సంస్థ నడుస్తోంది. తనకు స్పూర్తి ప్రముఖ క్రికెటర్ గౌతమ్ గంభీర్ అని చెప్పాడు. అతడు కూడా ఒక్క రూపాయికే భోజనం పెట్టడం మమ్మల్ని ఆకట్టుకుందన్నారు. ఆ ఆలోచన నుంచి వచ్చిన వెంటనే హైదరాబాద్‌లో ఒక్క రూపాయికే పెడదామని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. వలస కార్మికులకు హైదరాబాద్ నీడను ఇస్తోంది.. వీరందరికీ తమ ప్రయత్నం గురించి తెలుస్తుందో.. లేదో అనుకున్నాం.. కానీ.. చాలా మంది వస్తున్నట్లు తెలిపారు. భోజనం తిన్న వారు బాగుందని ఒక్క మాట చెబితే.. మాకు ఎంతో సంతోషంగా ఉంటుందన్నారు. ప్రస్తుతం నగరంలో ఒక్క ప్రాంతంలోనే నడుపుతున్నామని.. భవిష్యత్‌లో దీనిని విస్తరిస్తామన్నారు.
Also Read: వికలాంగురాలిపై లైంగిక దాడి చేయించిన భర్త.. ఒకేసారి ఐదుగురు కలిసి!