మరో ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. 20 మందికి పైగా అస్వస్థత!
కరీంనగర్ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. మధ్యాహ్నభోజనం వికటించి విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ముగ్గురు విద్యార్థులు వాంతులు చేసుకోగా.. మరో 20 మంది కడుపునొప్పితో విలవిల్లాడారు. ఈ ఘటన గంగాధర మండలం బూర్గుపల్లిలో జరిగింది.