/rtv/media/media_files/2024/11/23/dIh9KnSwZmQ5hr6PEpR9.jpg)
Bumrah : బోర్డర్ - గావస్కర్ ట్రోఫీ తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో భారత జట్టు ఆధిక్యంలో నిలిచింది. భారత బౌలర్ల ధాటికి ఆసీసీ బ్యాటర్లు గజగజ వణికిపోయారు. బుమ్రా బృందం నిప్పులు చెరిగే బంతులను ఎదుర్కోలేక 104 పరుగులకే చేతులెత్తేశారు. దీంతో భారత్ 46 పరుగుల ఆధిక్యం దక్కింది. ఓవర్‌నైట్ స్కోర్ 67/7తో రెండో రోజు ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆసీస్ ను క్రీజులో కుదురుకోనివ్వలేదు. జస్‌ప్రీత్ బుమ్రా 5, హర్షిత్ రాణా 3, మహ్మద్ సిరాజ్ 2 వికెట్లతో కంగారులను కంగారెత్తించారు.
ఇది కూడా చదవండి: ఖాళీ కడుపుతో ఈ కషాయం తాగితే మీ గుండె సేఫ్
Innings Break!
— BCCI (@BCCI) November 23, 2024
Australia have been bowled out for 104 runs and #TeamIndia secure a 46-run lead. Captain @Jaspritbumrah93 leads by example taking 5 wickets, while debutant Harshit Rana gets 3 and @mdsirajofficial has 2.
It is time for Lunch on Day 2 and post that the Indian… pic.twitter.com/eryt7KsGKf
Also Read : వయనాడ్‌లో లక్ష ఓట్ల మెజార్టీతో దూసుకుపోతున్న ప్రియాంక గాంధీ
భారత బౌలర్లను విసిగించిన స్టార్క్..
ఆస్ట్రేలియా బ్యాటర్లలో ఉస్మాన్ ఖావాజా 8, మెక్‌స్వీనీ 10, లబుషేన్ 2, స్టీవ్ స్మిత్ డకౌట్, ట్రావిస్ హెడ్ 11, మిచెల్ మార్ష్ 6, అలెక్స్ కేరీ 21, కమిన్స్ 3, నాథన్ లైయన్ 5 పరుగులు చేశారు. చివరలో మిచెల్ స్టార్క్ (26: 112 బంతుల్లో 2 ఫోర్లు) చాలాసేపు భారత బౌలర్లను పరీక్ష పెట్టాడు. హేజిల్‌వుడ్ (7*)తో కలిసి 10వ వికెట్‌కు విలువైన పరుగులు రాబట్టాడు. అయితే లంచ్ బ్రేక్‌కు ముందు చివరి ఓవర్‌లో హర్షిత్ రాణా బౌలింగ్‌లో స్టార్క్ భారీ షాట్‌కు యత్నించి ఔట్ అయ్యాడు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో స్టార్క్ టాప్ స్కోరర్ కావడం విశేషం.
ఇది కూడా చదవండి: గ్రూప్-1 మెయిన్స్ అభ్యర్థులకు అలర్ట్.. తుది ఫలితాల డేట్ ఫిక్స్
ఇక మొదటి ఇన్నింగ్స్ లో 20 వికెట్లు పేసర్లే తీయడం గమనార్హం. కాగా భారత బౌలర్లు బుమ్రా 5, హర్షిత్ రాణా 3, మహ్మద్ సిరాజ్ 2 వికెట్లు పడగొట్టారు. ఇక ఆసీస్ బౌలర్లలో జోష్ హేజిల్‌వుడ్ 4, మిచెల్ స్టార్క్ 2, కమిన్స్ 2, మిచెల్ మార్ష్ 2 వికెట్లు పడగొట్టారు.
ఇది కూడా చదవండి: థియేటర్ లో కన్నీళ్లు పెట్టుకున్న రాకింగ్ రాకేష్.. వీడియో వైరల్