అంధులకు దారి చూపించే AI కళ్లద్దాలు.. చదివిస్తాయి కూడా

అంధులకు దారి చూపించే ఏఐ ఆధారిత కళ్లద్దాలు అందుబాటులోకి వచ్చాయి. ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు ఈ కళ్లద్దాలు దారి చూపిస్తాయి. టెక్స్ట్‌ టు స్పీచ్‌ సాయంతో పుస్తకంలోని అక్షరాలను చదివి వినిపిస్తాయి. వీటి కోసం ముందుగా స్టోర్ చేసుకోవలసి ఉంటుంది.

New Update
AI glasses (1),

ఈ టెక్నాలజీ ఓ అద్భుతం.. ఆశ్చర్యకరం. ఇలాంటి సాంకేతికతను ఇప్పటి వరకు ఎవరూ చూసుండరు.. వినుండరు కూడా. అది మరేదో కాదు.. అంధులకు దారి చూపించే ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) కళ్లద్దాలు. అవును నేను చెప్పింది.. మీరు విన్నది నిజమే. ఏఐ టెక్నాలజీతో వచ్చిన ఆ కళ్లద్దాల ద్వారా ఎంత దూరమైన నడిచి వెళ్లిపోవచ్చు. అంతేకాదండోయ్, చదవడం, రాయడం కూడా నేర్చుకోవచ్చు. ఇవి పూర్తిగా అందుబాటులోకి వస్తే అంధులు ఎవరి సాయం లేకుండా ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. 

ఇది కూడా చదవండి: నకిలీ RTO ఘరానా మోసం.. ఈ ట్విస్టు ఊహించడం కష్టమే భయ్యా!

తాజాగా ఏఐ సాంకేతికతతో కూడిన కళ్లద్ధాలు అందుబాటులోకి వచ్చాయి. వీటిని అంధులు ధరిస్తే చాలు.. వారి పనులు చేసుకోగలరు. వీటిని ధరించి ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. బయటకు వెళ్లేందుకు ఈ కళ్లద్దాలు దారి చూపిస్తాయి. అంతేకాకుండా.. టెక్స్ట్‌ టు స్పీచ్‌ సాయంతో అక్షరాలను సైతం ఈ అద్దాలు చదివి వినిపిస్తాయి.

కిమ్స్‌ ఫౌండేషన్, పరిశోధన కేంద్రం, డీఆర్‌డీవో మాజీ శాస్త్రవేత్త డాక్టర్‌ వి.భుజంగరావు ఆధ్వర్యంలో ఈ కళ్లద్దాలకు రూపకల్పన చేయగా.. తాజాగా వీటిని ఆవిష్కరించారు. తొలి విడతలో భాగంగా 100 మంది అంధ విద్యార్థులకు పంపిణీ చేశారు. త్వరలో మరింత టెక్నాలజీతో వీటిని తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. కాగా ఈ కళ్లద్దాల ఒక్కో జత తయారీ కోసం రూ.10,000 వరకు ఖర్చు అయిందని పేర్కొన్నారు. 

ఈ కళ్లద్దాలు ఎలా దారి చూపిస్తాయి.. ఎలా చదివిస్తాయి:

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) స్మార్ట్ కళ్లద్దాల్లో కంప్యూటర్ విజన్, మెషీన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్ ఉపయోగించారు. అలాగే ఇందులో USB, బ్యాటరీ అందించారు. వీటి ద్వారా చార్జింగ్ పెట్టుకునే సదుపాయం కల్పించారు. దీని కోసం ప్రత్యేకంగా ఒక యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. 

ఇది కూడా చదవండి: తెలంగాణలో 13 నర్సింగ్ కాలేజీలకు అనుమతి

అయితే ఇందులో ఒక చిప్ సెట్ అందించారు. అందులో వ్యక్తుల ముఖాలు, ముఖ్యమైన ప్రదేశాలు, ఇంటి చిరునామా వంటి ఇన్‌ఫర్మేషన్ ముందుగానే అప్‌లోడ్ చేసుకోవాలి. 

దాదాపు 400 మంది వ్యక్తుల ముఖాలను USB మెమోరీలో పేర్లతో స్టోర్ చేసుకోవచ్చు. 

కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు, బంధువులు ఇలా అందరి పేర్లు, ముఖాలను స్టోర్ చేయడం ద్వారా అంధులు ఎప్పుడైనా గుర్తించలేనపుడు ఈ కళ్లద్దాలు ఎదురుగా ఉన్న వ్యక్తులను గుర్తిస్తాయి.

వీటితో పాటు కళ్లద్దాల్లోని యాప్‌లో ఉన్న టెక్స్ట్ టు స్పీచ్ రీడింగ్ అసిస్టెంట్ టెక్నాలజీ ద్వారా బుక్‌లోని టెక్స్ట్‌ను చదివి వినిపిస్తాయి. అంతేకాకుండా దూర ప్రాంతాలు వెళ్లినపుడు అక్కడ ఉండే బోర్డులు సహా మరికొన్నింటిని చదవడం వీలుగా ఉంటుంది. 

ఇక ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటే ముందుగానే ఎక్కడ నుంచి ఎక్కడకు ప్రయాణించాలనుకుంటున్నారో అక్కడి ప్రదేశాలను స్టోర్ చేసుకోవాలి. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు