/rtv/media/media_files/2026/02/20/eighth-2026-02-20-07-09-02.jpg)
eighth-class-girl-raped-by-three-persons in hyderabad
హైదరాబాద్ శివారు నార్సింగి పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. 8వ తరగతి బాలికపై గ్యాంగ్ రేప్ జరగడం కలకలం రేపింది. ఓ నేరస్థుడు, ఇద్దరు బాలురు మద్యం తాగించి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన ప్రకారం.. పుప్పాలగూడకు చెందిన 15 ఏళ్ల బాలిక 8వ తరగతి చదువుతోంది. ఫిబ్రవరి 7న చార్మినర్ వద్ద షాపింగ్‌కు వెళ్లిన సమయంలో అక్కడ ఫుట్‌పాత్‌పై వ్యాపారం చేసుకుంటున్న ఓ బాలుడు (16) ఆమెతో పరిచయం చేసుకుని ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. ఆ తర్వాత ఫోన్ చేసి మళ్లీ కలుద్దామన్నాడు.
దీంతో ఆ బాలిక ఈ నెల 16న స్కూల్‌కు వెళ్తున్నానని చెప్పి చార్మినర్‌కు వచ్చింది. రాత్రియినా ఆమె ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆ బాలిక కోసం గాలించారు. సీసీ కెమెరా ద్వారా బాలిక చెంగిచర్లలో ఉన్నట్లు గుర్తించారు. అయితే ఆ బాలిక తన వద్దకు రావడాన్ని అవకాశంగా తీసుకున్న ఆ బాలుడు పాతబస్తీకి రెయిన్‌బజార్‌కు చెందిన తన స్నేహితుడు ఆటో డ్రైవర్ ఇమ్రాన్ ఖాన్(24)ను, తలాబ్‌కట్టకు చెందిన మరో స్నేహితుడిని పిలిపించాడు.
ఆ బాలికను చార్మినార్ పరిసర ప్రాంతాల్లో తిప్పి అర్ధరాత్రి తర్వాత చెంగిచెర్లకు తీసుకెళ్లారు. అక్కడ డబుల్ బెడ్‌రూం ఇళ్ల దగ్గరికి తీసుకెళ్లారు. ఆ ముగ్గురు బాలురు మద్యం తాగి, బాలికతో కూడా బలవంతంగా తాగించారు. కత్తితో బెదిరించి ఈమెపై గ్యాంగ్ రేప్ చేశారు. ఈ ఘటన జరిగిన స్థలంలో ఆ బాలికతో పాటు ఉన్న ఓ బాలుడు, ఇమ్రాన్‌ఖాన్‌ను అరెస్టు చేశారు. ఇదిలాఉండగా ఇమ్రాన్‌ఖాన్ దొంగతనం, భౌతికదాడులు సహా 8 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ఇక మరో బాలుడు పరారీలో ఉన్నాడని అతడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు చెప్పారు.
Follow Us