యాదాద్రి జిల్లా రోడ్డు ప్రమాదంలో ఐదుగురు చనిపోయారు. భూదాన్ పోచంపల్లి మండలం జలాల్ పూర్ గ్రామంలో కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో కారులో ఆరుగురు ప్రయాణిస్తున్నారు. అందులో ఉన్న ఐదుగురు చనిపోయారు. మణికంఠ పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు చికిత్స కోసం హాస్పిటల్ కు తరలించారు. హైదరాబాద్ నుంచి పోచంపల్లికి వెళ్తుండా శనివారం తెల్లవారుజామున ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. చనిపోయిన ఐదుగురు విద్యార్థులు. Also Read : TS: తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట మృతులు హైదరాబాద్ కు చెందిన వారిగా గుర్తించారు. వంశీ గౌడ్ దినేష్, హర్ష, బాలు వినయ్ లు ఈ యాక్సిడెంట్ లో ప్రాణాలు కోల్పొయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. యాక్సిడెంట్ కు గల కారణాలు తెలుసుకుంటున్నారు. మృతదేహాలను చెరువులోనుంచి బయటకు తీశారు. పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పిటల్ కు చేరుస్తున్నారు పోలీసులు. Also Read: Google Maps: మరోసారి దారి తప్పించిన గూగుల్ తల్లి..ఈసారి అడవి పాలు! Also Read : ఇంటర్నెట్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. తక్కువ ఖరీదుకే కనెక్షన్! Also Read: తెలంగాణకు 7 నవోదయ, ఏపీకి 8 కేంద్రీయ విద్యాలయాలు ఆమోదం..