TS: తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట

తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు పెద్ద రిలీఫ్ ఇచ్చింది. గ్రూప్–1 నోటిఫికేషన్ రద్దు చేయడం కుదరదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.  యథావిధిగా మెయిన్స్ నిర్వహించాలని ఆర్డర్ ఇచ్చింది.

New Update
SUPREME COURT

తెలంగాణలో గ్రూప్–1 నోటిఫికేషన్ రద్దు చేయాలని, మెయిన్స్ వాయిదా వేయాలని కోరుతూ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది.  2022ల ఇచ్చిన గ్రూప్–1 నోటిఫికేషన్ కాకుండా కొత్తది 2024లో రిలీజ్ చేయాలని గతంలో తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2024 ప్రిలిమ్స్ పేపర్‌‌లో కూడా కొన్ని తప్పులున్నాయని...అందువల్ల మెయిన్స్ కూడా వాయిదా వేయాలని కోరారు. అయితే ఈ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. దీంతో అభ్యర్థులు హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. దీని మీదనే ఇప్పుడు సుప్రీం తీర్పును ఇచ్చింది. 

జస్టిస్ పి ఎస్ నరసింహ నేతృత్వంలోని ధర్మాసనం నోటిఫికేషన్ రద్దు పిటిషన్ ను విచారణ చేసింది. కోర్టును ఆశ్రయించిన అభ్యర్థులు ఎవరూ ప్రిలిమ్స్ పరీక్షలు పాస్ కానందున మెయిన్స్ వాయిదా వేయాల్సిన అవసరం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. పరీక్షల నిర్వహణలో కోర్టుల జోక్యం అనవసరమని, దీనివల్ల రిక్రూట్ మెంట్ ప్రక్రియ లేట్ అవడం తప్ప ఏం ఉపయోగం లేదని..కూడా ధర్మాసనం అభిప్రాయపడింది. అభ్యర్థుల అభ్యంతరాలను తోసిపుచ్చిన కోర్టు మెయిన్స్ పరీక్షల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Also Read: Mytri Movie Makers: పుష్ప–2 షేక్ డైలాగ్స్‌పై  టీమ్ సీరియస్ వార్నింగ్

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు