Lucky Draw: అందుకే అంటారేమో కూతుర్ని లక్ష్మీదేవి అని.. రూ.500కే రూ.16 లక్షల ఇల్లు!

ఆడపిల్లని ఆ ఇంటి లక్ష్మీ దేవి, మహాలక్ష్మీ అని అంటుంటారు. ఓ ఇంటి మహాలక్ష్మీ పుట్టిన 10 నెలలకే ఇంటినే తీసుకొచ్చింది. దీంతో ఆ తండ్రికి సంతోషానికి హద్దులు లేదు. ఎందుకంటారా..? అసలు విషయం తెలిస్తే మీ మోఖాల్లో కూడా ఆనందం, ఆశ్చర్యం రెండు వెలిగిపోతాయి.

New Update
NlG Family

ఆడపిల్లని ఇంటిలక్ష్మీ దేవి అని అంటారు. మరీ ముఖ్యంగా చాలా కుటుంబాల్లో తండ్రి కూతుర్ని ముద్దుగా చూసుకుంటాడు. ఓ ఇంటి లక్ష్మీదేవి పుట్టిన 10 నెలలకే ఇంటినే తీసుకొచ్చింది. దీంతో ఆ తండ్రికి సంతోషానికి హద్దులు లేదు. ఎందుకంటారా..? అసలు విషయం తెలిస్తే మీ మోఖాల్లో కూడా ఆనందం, ఆశ్చర్యం రెండూ వెలిగిపోతాయి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌(Choutuppal)లో నిర్వహించిన లక్కీ డ్రా(Luckydraw)లో రూ.500లకే ఓ కుటుంబం రూ.16లక్షల విలువైన ల్యాండ్(land Luckydraw) సొంతం చేసుకుంది.

ఓ వ్యక్తి తన ఇంటి స్థలం అమ్మాలని వినూత్న ఆలోచనలో లక్కీ డ్రా పద్దతి పెట్టాడు. లాటరీ విధానం రాష్ట్రంలో చట్టబద్ధం కాకున్నా.. ల్యాండ్ ఓనర్ వినూత్న ఆలోచన స్థానికులను ఆకర్షించింది. కొందరు తమ అదృష్టాన్ని పరీక్షించుకోగా.. ఇంటి యజమానికి ఆశించిన దానికంటే రూ.3లక్షల ఎక్కువ లాభం వచ్చింది. దీంతో ఇక్కడ ఇద్దరికీ బాగా కలిసి వచ్చింది.

Also Read :  Jubilee Hills By-Election: నవీన్ యాదవ్‌పై మరో పోలీస్ కేసు నమోదు

లక్కీ డ్రా ఇలా..

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో కంచర్ల రామబ్రహ్మం.. తనకున్న 66 గజాల ఇంటి స్థలం అమ్మకానికి లక్కీడ్రా పద్ధతి పెట్టారు. ఆసక్తి గలవారు రూ.500తో కూపన్‌ కొనుగోలు చేసి లక్కీడ్రాలో పాల్గొనాలని నేషనల్ హైవే పక్కనున్న ఇంటికి ఫ్లెక్సీలు కట్టారు. దాని మార్కెట్‌ ప్రకారం ల్యాండ్ విలువ రూ.16 లక్షలు ఉంటుంది. ఓనర్ 3,000 కూపన్లు ముద్రించాడు. వాటిని కొనుగోలు చేసిన వారు దానిపై తమ వివరాలు రాసి ఆ ఇంటి వద్ద ఏర్పాటు చేసిన డబ్బాలో వేయాలి. నవంబరు 2న లక్కీడ్రా తీస్తానని ఓనర్ ప్రకటించాడు. ఆలోచన కొత్తగా ఉందని ఈ సమాచారం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. విషయం తెలుసుకున్న సంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లికి చెందిన శంకర్‌ తన కుటుంబ సభ్యుల నలుగురి పేర్ల మీద 4 కూపన్లు కొన్నాడు.

ముందుగా ప్రకటించినట్లుగా ఆదివారం(నవంబర్ 2) కూపన్లు కొనుగోలు చేసిన వారి సమక్షంలోనే లక్కీ డ్రా తీశారు. చౌటుప్పల్ పురపాలిక పరిధి లింగారెడ్డి గూడెంలోని జియన్ రెడ్డి ఫంక్షన్ హాల్‌లో లక్కీ డ్రా నిర్వహింగా.. శంకర్‌ కుమార్తె హన్సిక(10నెలలు)ని అదృష్టం వరించింది. రూ.16లక్షల ఇంటిని వారు లక్కీడ్రాలో రూ.500లకే గెలుచుకున్నారు. 2307 సీరియల్ నెంబర్‌తో కూపన్ కొనుగోలు చేసిన హన్సిక తల్లిదండ్రులకు నిర్వాహకుడు ఫోన్ చేసి విషయం చెప్పాడు. ఆమె కోరిన సమయంలో రిజిస్ట్రేషన్ చేస్తానని ప్రకటించారు. ఇంటితో సహా 66 గజాల ప్లాటును విక్రయించేందుకు రెండేళ్లు ప్రయత్నించినా అమ్ముడుపోకపోవడంతో ఈ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టినట్లు రామబ్రహ్మం తెలిపారు. రూ.500 చొప్పున దాదాపు 3,600 కూపన్లు అమ్ముడు పోయాయని, ఆశించిన దానికన్నా రూ.3 లక్షలు అదనంగా వచ్చాయని ఆనందం వ్యక్తం చేశారు. అటు శంకర్ ఇంటి లక్ష్మీ పుట్టిన ఏడాదిలోనే తండ్రికి కనక వర్షం కురిపించింది. ఇందుకే అంటారేమో కూతురు ఆ ఇంటి మహాలక్ష్మీ అని కదా మరీ.

Also Read :  పెళ్లి పేరుతో గర్భవతిని చేసి మోసం చేసిన ప్రియుడు.. ఇంటిముందు ప్రియురాలి ధర్నా

Advertisment
తాజా కథనాలు