Suryapet: నకిలీ వైద్యుడి గుట్టురట్టు..ఏకంగా గుండె ఆపరేషన్లు చేసి...

సూర్యాపేట జిల్లా కేంద్రంలో నకిలీ గుండె వైద్యుడి బాగోతం బట్టబయలైంది. శరత్ కార్డియాక్ కేర్ సెంటర్‌ పేరుతో నిర్వహిస్తున్న ఆసుపత్రిలో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ తనిఖీలు చేపట్టింది. గుండె సంబందిత డాక్టర్ కాకపోయినప్పటికీ చికిత్సలు చేస్తున్నట్లు గుర్తించారు.

New Update
Fake doctor

Fake doctor

Suryapet: ఈ మధ్యకాలంలో నకిలీ వైద్యుల దందా బాగా పెరిగిపోయింది. ఎలాంటి విద్యార్హతలు లేకున్నా డాక్టర్లమంటూ చలామణి అవుతూ ప్రజల జీవితాలతో చలగాటమాడుతున్నారు. అలాంటి ఘటనే సూర్యాపేటలో చోటు చేసుకుంది. సూర్యాపేట జిల్లా కేంద్రంలో నకిలీ గుండె వైద్యుడి బాగోతం బట్టబయలైంది. శరత్ కార్డియాక్ కేర్ సెంటర్‌ పేరుతో నిర్వహిస్తున్న ఆసుపత్రి పై వచ్చిన పలు ఫిర్యాదుల నేపథ్యంలో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ అధికారులు ఆసుపత్రిలో తనిఖీలు చేపట్టారు. 

Also Read: బాలయ్య బర్త్ డేకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. ఫ్యాన్స్ కి పండగే..!

ఈ సందర్భంగా ఆసుపత్రి అనుమతులు కార్డియాక్ డాక్టర్ పేరుతో తీసుకున్నప్పటికీ, వైద్య సేవలు మాత్రం కేవలం ఎంబీబీఎస్ అర్హత కలిగిన డాక్టర్ నిర్వహిస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. గుండె సంబంధిత వైద్య సేవల పర్యవేక్షణలో అనుభవం లేకపోయిన డాక్టర్, గుండె సంబంధిత జబ్బులకు చికిత్స చేస్తూ.. 2D ఈకో వంటి ముఖ్యమైన టెస్టులు నిర్వహిస్తున్నట్లు అధికారులు నిర్ధారించారు. ఇది వైద్య నైతికతకు విరుద్ధమని, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న చర్య అని అధికారులు పేర్కొన్నారు.

lso Read: చైనాకు మరో బిగ్ షాక్.. 245 శాతం టారిఫ్‌ విధించిన ట్రంప్‌ సర్కార్

గుండె సంబందిత డాక్టర్ కాకపోయినప్పటికీ చికిత్సలు నిర్వహిస్తూ ప్రజలను మోసం చేస్తున్నాడని అధికారులు నిర్ధారించారు. ఈ ఘటనపై ఆసుపత్రిని నిర్వహిస్తున్న డాక్టర్లపై నేషనల్ మెడికల్ కౌన్సిల్ (NMC) చట్టం ప్రకారం ఫోర్జరీ కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఆసుపత్రి అనుమతుల విషయంలోనూ మోసపూరితంగా వ్యవహరించినందుకు సంబంధిత అధికారులను కూడా విచారించనున్నారు. ప్రజల ప్రాణాలకు సంబంధించిన విషయాల్లో ఇలాంటి నిర్లక్ష్యం ఎంత పెద్ద ప్రమాదాన్ని కలిగించగలదో ఈ ఘటన మరోసారి రుజువు చేసింది. సంబంధిత వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కాగా గతంలోనూ ఆర్ఎంపీ డాక్టర్లు పలువురు ఎంబీబీఎస్, ఇతర కోర్సులు చేసినట్లు నమ్మించి వైద్యం చేసి పట్టుబడ్డారు. మరికొన్ని చోట్ల అసలు వైద్యవృత్తి చదవకుండా నకిలీ సర్టిఫికెట్లతో వైద్యం చేస్తున్న వారిని సైతం అరెస్ట్ చేశారు.

Also Read: వీకెండ్ కలెక్షన్స్ లో దుమ్ము దులిపేసిన ‘జాట్’..

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు