/rtv/media/media_files/2025/11/11/exit-polls-2025-11-11-18-59-39.jpg)
జూబ్లిహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. ప్రధాన పార్టీ బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్‌లు పోటాపోటీగా ప్రచారం చేశాయి. దీంతో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ నెలకొంది. పలు సర్వే సంస్థలు ఈ ఉప ఎన్నికపై ఎగ్జిట్ పోల్స్(jubilee hills by election exit polls) రిలిజ్ చేశాయి. దాదాపు అన్నీ సర్వే సంస్థ ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ గెలుస్తోందని వచ్చాయి.
Also Read : BRS అభ్యర్థి మాగంటి సునీతపై ఫిర్యాదు.. MLA కౌశిక్ రెడ్డి అరెస్ట్
Exit Polls On The Jubilee Hills By-Election
ఆపరేషన్ చాణిళ్య జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలో కాంగ్రెస్ అభ్యర్థి విజయం ఖాయమని చెప్పింది. 48శాతం ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పోలైయ్యాయని అంచనా.
స్మార్ట్ పోల్=== కాంగ్రెస్: 48.2%, బీఆర్ఎస్: 42.1%
నాగన్న సర్వే=== కాంగ్రెస్: 47%, బీఆర్ఎస్: 41%
Also Read : జూబ్లీహిల్స్ లో హైటెన్షన్.. సునీత ధర్నా.. పోలీసుల లాఠీ ఛార్జ్!
ఇక పీపుల్స్ పల్స్ రీసర్చ్ సంస్థ జూబ్లీహిల్స్ ఉపఎన్నికలపై ఎలాంటి ఎగ్జిట్ పోల్ ఇవ్వలేదని ప్రకటించింది.
పీపుల్స్ పల్స్ రీసర్చ్ సంస్థ జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు సంబంధించి, ఎలాంటి ఎగ్జిట్ పోల్, ఎన్నికల సర్వే నిర్వహించలేదు. కొన్ని మీడియా చానెళ్లలో పీపుల్స్ పల్స్ సంస్థ పేరిట వస్తున్న ఫలితాలకు, మాకు ఎలాంటి సంబంధం లేదు.
— Peoples Pulse (@PeoplesPulseOrg) November 11, 2025
-పీపుల్స్ పల్స్ రీసర్చ్ సంస్థ, హైదరాబాద్#exitpoll
Follow Us