BREAKING: BRS అభ్యర్థి మాగంటి సునీతపై ఫిర్యాదు.. MLA కౌశిక్ రెడ్డి అరెస్ట్

BRS అభ్యర్థి మాగంటి సునీతపై ప్రెస్‌మీట్‌ నిర్వహణపై కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు ఇచ్చారు. పోలింగ్ పూర్తయ్యే వరకు అన్ని రాజకీయ పత్రికా సమావేశాలపై ఎన్నికల కమిషన్ నిషేధించింది. దీనిపై కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేసి ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు.

New Update
jubillee

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. పోలింగ్ చివరి దశలో పలు బూత్‌ల్లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతపై కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫిర్యాదు ఇచ్చారు. పోలింగ్ పూర్తయ్యే వరకు అన్ని రాజకీయ పత్రికా సమావేశాలపై ఎన్నికల కమిషన్ నిషేధించింది. వాటిని లెక్కచేయకుండా మాగంటి సునీత ప్రెస్‌మీట్ పెట్టారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేసి ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన వారికి పోలీసులు మద్దతు తెలుపుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులు నిరసనకు దిగారు. నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.

యూసఫ్‌గూడ చెక్‌పోస్ట్ దగ్గర హై టెన్షన్ వాతావరణం నెలకొంది. అధికారులకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నేతలు ఆందోళనలకు దిగారు. బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తి చేసింది. దొంగ ఓట్లు వేయిస్తున్నారంటూ బీఆర్ఎస్ నాయకులు ఆందోళనకు దిగారు. ఆ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతా రోడ్డుపై బైఠాయించారు.

Advertisment
తాజా కథనాలు