/rtv/media/media_files/2025/04/03/PsvX7JTfTvo0sYoRX1WP.jpg)
Rains
Heavy rains: బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి కొనసాగుతున్నది. ఆ ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం క్యుములోనింబస్ మేఘాల వల్ల తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేఘాల మూలంగా శుక్ర, శనివారాల్లోనూ రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ చెప్పింది. తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని వెల్లడించింది. ఈ రోజు ద్రోణి మరింత బలపడే అవకాశం ఉండటంతో రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
Also read: తిరిగి రారా తమ్ముడా.. చితిపైనే తమ్ముడికి రాఖీ కట్టిన అక్క
నిన్న రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఈ రోజు కూడా అదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. దక్షిణ, మధ్య తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈరోజు సాయంత్రం, రాత్రి సమయాల్లో భారీ వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. రాత్రి సమయంలో జయశంకర్ భూపాలపల్లి, నిర్మల్ సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, రంగారెడ్డి, జిల్లాల్లో వర్షం పడే అవకాశముందని తెలిపింది. సూర్యాపేట, నల్లగొండ, ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి - కొత్తగూడెం, రంగారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్ తూర్పు, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో సాయంత్రం నుంచి రాత్రి వేళల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేశారు. మిగిలిన జిల్లాల్లో సాయంత్రం నుంచి రాత్రి వేళల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు.ఈ నెల 13న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో ఆయా జిల్లాల్లో13, 14, 15 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి:తెలంగాణ రైతులకు శుభవార్త.. కొత్త పాస్‌బుక్ వచ్చిన వారందరికీ ఈ నెలలో రైతు బీమా
మరో ఐదు రోజులు భారీ వర్షాలు
దీనితో పాటు శనివారం నుంచి రాబోవు ఐదు రోజులపాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. 9, 10 తేదీల్లో నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట్, నల్గొండ, మహబూబ్ నగర్, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. 11, 12వ తేదీలలో తెలంగాణవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 13వ తేదీన తెలంగాణలోని అన్ని జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.