Heavy rains: తెలంగాణకు ఎల్లో అలర్ట్.. ఆ జిల్లాలకు భారీ వర్షసూచన
బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి కొనసాగుతున్నది. ఆ ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. క్యుములోనింబస్ మేఘాల మూలంగా శుక్ర, శనివారాల్లోనూ రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.