HIV Positive After Dialysis : డయాలసిస్‌కు పోతే హెచ్‌ఐవీ అంటగట్టిన్రు..

మూత్రపిండాల సమస్యతో డయాలసిస్‌ చేయించుకుంటున్న ఓ వృద్దుడికి హెచ్‌ఐవీ పాజిటివ్‌ అని తేలడం కలకలం రేపింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని డయాలసిస్‌ కేంద్రంలో చికిత్స చేయించుకుంటున్న గిరిజన వృద్ధుడుకి హెచ్‌ఐవీ అని తేలడంతో లబోదిబో మంటున్నాడు.

New Update
HIV Positive After Dialysis

HIV Positive After Dialysis:

HIV Positive After Dialysis: మూత్రపిండాల సమస్యతో డయాలసిస్‌ చేయించుకుంటున్న ఓ వృద్దుడికి హెచ్‌ఐవీ పాజిటివ్‌ అని తేలడం కలకలం రేపింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని డయాలసిస్‌ కేంద్రంలో గడచిన ఏడు నెలలుగా చికిత్స చేయించుకుంటున్న గిరిజన వృద్ధుడు (60)కి హెచ్‌ఐవీ అని తేలడంతో అతను లబోదిబో మంటున్నాడు.  డయాలసిస్‌ కేంద్రం నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే తాను హెచ్‌ఐవీ బారిన పడ్డానంటూ వృద్ధుడు శుక్రవారం మణుగూరు డయాలసిస్‌ కేంద్రం వద్ద ఆందోళన చేపట్టడంతో ఈ విషయం వెలుగు చూసింది.

ఇది కూడా చూడండి:TG Dasara Holidays: తెలంగాణ స్టూడెంట్స్ కు అదిరిపోయే శుభవార్త.. దసరా సెలవులు ప్రకటించిన సర్కార్.. లిస్ట్ ఇదే

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలానికి చెందిన గిరిజన వృద్ధుడికి 2024లో కిడ్నీ సంబంధ సమస్యలు ఏర్పడ్డాయి.  దీంతో డయాలసిస్‌ చేయించుకునేందుకు ఈ ఏడాది జనవరిలో మణుగూరు ఆస్పత్రిలోని డయాలసిస్‌ కేంద్రంలో చేరాడు. కాగా డయాలసిస్‌కు ముందు అతనికి రక్తపరీక్షలు చేయగా సదరు వ్యక్తి రక్తహీనతతో బాధపడుతున్నట్టు గుర్తించారు. దీంతో భద్రాచలం బ్లడ్‌ బ్యాంక్‌ నుంచి రక్తం తెప్పించి తొలిసారి జనవరి 15న ఎక్కించారు. అలా అప్పట్నించి ఆగస్టు 15 వరకు ప్రతి నెలా వారానికి మూడుసార్లు ఆ వృద్ధుడికి డయాలసిస్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆగస్టు 15న చేసిన రక్త పరీక్షల్లో ఆ వృద్ధుడికి హెచ్‌ఐవీ పాజిటివ్‌ అని తేలడంతో అంతా అవాక్కాయ్యారు. ఈ విషయాన్ని రోగి, అతడి కుటుంబసభ్యులకు తెలియజేశారు. అయితే అనుమానంతో  వారు ఓ ప్రైవేటు డయాగ్నస్టిక్‌ సెంటర్‌లో తిరిగి పరీక్షలు చేయించారు. అక్కడ కూడా  పాజిటివ్‌ ఫలితం వచ్చింది. 

ఇది కూడా చదవండి:గణేశుడి నిమజ్జనానికి 5 శుభ ముహూర్తాలు ఇవే!

వృద్ధుడికి హెచ్‌ఐవీ పాజిటివ్‌గా తేలడంతో మణుగూరు డయాలసిస్‌ కేంద్రంలో ఆ వృద్ధుడికి డయాలసిస్‌ సేవలు ఆపేశారు. ఆ తర్వాత ఆయనకు భద్రాచలంలోని హెచ్‌ఐవీ కేంద్రం ద్వారా మందులు అందజేస్తున్నారు. మూత్ర పిండాల సమస్యతో బాధపడే హెచ్‌ఐవీ బాధితులకు ప్రత్యేకంగా హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో డయాలసిస్‌ సేవలు అందిస్తారు.  తప్పనిసరి పరిస్థితుల్లో ఆ బాధిత వృద్ధుడు ఇటీవల హైదరాబాద్‌ వచ్చి డయాలసిస్‌ చేయించుకున్నాడు. అయితే, తన బంధువులతో కలిసి శుక్రవారం మణుగూరు డయాలసిస్‌ కేంద్రానికి వచ్చిన వృద్ధుడు కేంద్రం నిర్వాహకులను ఈ విషయమై నిలదీశాడు. తను డయాలసిస్‌ మొదలు పెట్టిన జనవరి నాటికి తనకు కిడ్నీ సమస్య మాత్రమే ఉందని అలాంటిది హెచ్‌ఐవీ ఎలా వచ్చిందో చెప్పాలని వారిని నిలదీశాడు. కాగా, ఈ అంశంపై మణుగూరు డయాలసిస్‌ సెంటర్‌ నిర్వాహకుడు సంతోష్‌ రెడ్డిని మీడియా ప్రతినిథులు వివరణ కొరగా సదరు రోగి మణుగూరు ఆస్పత్రికి రాక ముందు హైదరాబాద్‌, ఖమ్మం, వరంగల్‌లోని పలు ఆస్పత్రుల్లో చికిత్స తీసుకున్నాడని, అక్కడెక్కడైనా పొరపాటు జరిగి హెచ్‌ఐవీ సోకి ఉంటుందని తెలిపారు.

ఇది కూడా చూడండి:Ganesh Nimajjanam 2025: వినాయక నిమజ్జనాల్లో అపశ్రుతి.. క్రేన్ తెగి పడి ఇద్దరు.. నీటిలో కొట్టుకుపోయి మరికొరు..!

Advertisment
తాజా కథనాలు