/rtv/media/media_files/2025/04/18/QsW55K70MYyvwuZxvW5m.jpg)
Vakiti Srihari-mallu ravi
Vakiti Srihari : తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ అంశం రోజుకో మలుపు తిరుగుతున్న విషయం తెలిసిందే. నాకు మంత్రిపదవి ఇవ్వాలంటే నాకు ఇవ్వాలంటూ ఒకరిని మించి మరోకరు అధిష్టానం మీదా ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఈ స్టేట్‌మెంట్లపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రివర్గ విస్తరణ అంశం హైకమాండ్ పరిధిలో ఉంటుంది అని దానిపై మాట్లాడొద్దు అని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అలాగే పార్టీ లైన్ దాటితే ఉపేక్షించేది లేదు అని హెచ్చరించారు. ఇలాంటి తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి పేరుతో ఓ ఫేక్ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం సంచలనంగా మారింది. మంత్రివర్గం రేసులో ఉన్న మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రి పదవి ఇవ్వొద్దు అంటూ సీఎం రేవంత్ రెడ్డి పేరుతో ఓ లేఖ వైరల్ అవ్వడం కలకలం రేపుతోంది.ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకత్వం ఫేక్ లెటర్‌పై ఆరా తీస్తోంది. ఫేక్ లెటర్లను షేర్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకునే యోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని తెలుస్తోంది.
Also read: Lady Don: హాట్ టాపిక్‌గా లేడీ డాన్ జిక్రా.. ఏకంగా ఢిల్లీ సీఎం వార్నింగ్
తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ అంశం రోజు రోజుకు ఆసక్తిరేపుతున్న సంగతి తెలిసిందే. రోజుకో పేరు తెరపైకి వస్తోంది. ఇప్పటికే ఆశావాహులు తమ తమ ప్రయత్నాలలో లాబీయింగ్ చేస్తుంటే మరికొందరు ఢిల్లీలో తిష్టవేసి అధిష్టానం ప్రాపకం కోసం ఎదురుచూస్తున్న పరిస్థితి. అంతేకాదు నాయకులు సైతం మంత్రివర్గంలోని స్థానంపై ఇష్టం వచ్చినట్లు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఈ స్టేట్‌మెంట్లపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రివర్గ విస్తరణ అంశం హైకమాండ్ పరిధిలో ఉంటుంది అని దానిపై మాట్లాడొద్దు అని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అలాగే పార్టీ లైన్ దాటితే ఉపేక్షించేది లేదు అని హెచ్చరించారు. ఇలాంటి తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి పేరుతో ఓ ఫేక్ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం సంచలనంగా మారింది. మంత్రివర్గం రేసులో ఉన్న మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రి పదవి ఇవ్వొద్దు అంటూ సీఎం రేవంత్ రెడ్డి పేరుతో ఓ లేఖ వైరల్ అవ్వడం కలకలం రేపుతోంది.
ఈ ఫేక్ లెటర్‌పై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి స్పందించారు. బీఆర్ఎస్ నేతలపై ఫైర్ అయ్యారు. సీఎం పేరుతో ఎవరైనా ఫేక్ లెటర్లు తయారు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. అదంతా అబద్దం అని, రేవంత్ రెడ్డి పేరుతో కావాలని కుట్ర చేస్తున్నారని మల్లు రవి మండిపడ్డారు. సీఎంకు మక్తల్ ఎమ్మెల్యేకు మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, అలాంటప్పుడు రేవంత్ రెడ్డి ఎందుకు అలా చేస్తారని వివరించారు. ఆ ఫేక్ లెటర్ ను కేటీఆర్ కావాలనే వారి నేతలతో సర్క్యులేట్ చేయిస్తున్నారని, ఇలాంటి ఫేక్ లెటర్లు తయారు చేయడంలో కేటీఆర్ దిట్ట అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై తప్పకుండా విచారణ జరిపిస్తామని, తప్పుడు లెటర్లు సృష్టించిన వారిని వదిలేది లేదని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Also read: Maoist: ఛత్తీస్‌గడ్‌లో 22 మంది మావోయిస్ట్ అగ్రనేతలు సరెండర్