/rtv/media/media_files/2026/02/17/fotojet-13-2026-02-17-11-58-16.jpg)
Kyathanapalli muncipal elections
Kyatanapalli : రాష్ట్రంలోని మున్సిపాలిటీల పాలక వర్గాల ఎంపిక కోసం నిర్వహిస్తున్న సమావేశాలు రసవత్తరంగా సాగుతున్నాయి. దాదాపు అన్ని పాలకవర్గాల ఎంపిక పూర్తయినప్పటికీ ఇంకా ఒకటి రెండు మున్సిపాలిటీల్లో ఎన్నిక పూర్తికాలేదు. ముఖ్యంగా మంచిర్యాల జిల్లా(manchiryala-district) క్యాతనపల్లి మున్సిపాలిటీ(Kyatanapalli Municipality) లో మూడు రోజులుగా హైటెన్షన్ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే రెండుసార్లు ఎన్నిక వాయిదా పడగా ఈ రోజు మూడోరోజు తిరిగి సమావేశం ఏర్పాటు చేశారు. కాగా నిన్న చైర్మన్ ను ఎన్నుకునేందుకు సమావేశం ఏర్పాటు చేసినప్పటికీ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఎన్నికను నేటికి వాయిదా వేశారు. అయితే కౌన్సిల్ లో మహిళ కౌన్సిలర్ల పట్ల కాంగ్రెస్ వారు అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణలతో ఈ రోజు క్యాతనపల్లి బంద్‌కు బీఆర్ఎస్, సీపీఐ పిలుపు నిచ్చాయి. ఈ క్రమంలో స్థానిక బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ నివాసాన్ని పోలీసులు చుట్టుముట్టడంతో వాతావరణం మరోసారి వేడెక్కింది. సుమన్ ను అరెస్ట్(balka-suman-arrest) చేస్తారన్న సమాచారంతో వందలాది మంది బీఆర్ఎస్ కార్యకర్తలు ఆయన నివాసానికి చేరుకున్నారు.
కాగా నిన్న చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కోసం నిర్వహించిన సమావేశం రసాబసాగా సాగింది. సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణల కాన్వయ్ లపై బీఆర్ఎస్, సీపీఐ నాయకులు రాళ్ల దాడి చేశారు.దీంతో ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో వాయిదా వేశారు. కాగా ఈరోజు తిరిగి సమావేశం ఏర్పాటు చేయగా, కౌన్సిల్ సమావేశంలో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణలతో ఈ రోజు క్యాతనపల్లి బంద్‌కు సీపీఐ, బీఆర్ఎస్ పిలుపునిచ్చాయి. ఈ క్రమంలో ముందు జాగ్తత్తగా పోలీసులు మొహరించారు. సుమన్‌ను అరెస్ట్ చేసే అవకాశం ఉండటంతో మంత్రి వివేక్ వెంకటస్వామికి వ్యతిరేకంగా కార్యకర్తలు పెద్ద పెట్టున నినాదాలు చేస్తున్నారు. మంగళవారం రోజున పోలీసుల విధులకు ఆటంకం కలిగించడంతోపాటు ఎస్ఐ, కానిస్టేబుల్‌పై దాడి చేశారని దేవాపూర్ ఎస్ఎహ్వో గంగారాం ఫిర్యాదు చేశారు. దాంతో బాల్క సుమన్ సహా పలువురు బీఆర్ఎస్ నేతలపై కేసులు నమోదయ్యాయి. చెన్నూరులో బీఆర్ఎస్ మాజీ కౌన్సిలర్ అనిల్‌ను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. మిగతా నాయకులను అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నాలు ముమ్మరం చేయడంతో మంచిర్యాల వ్యాప్తంగా ఉద్రిక్తత నెలకొంది.
Also Read : మేయర్, డిప్యూటీ మేయర్లు, చైర్మన్, వైస్ ఛైర్మన్ల జీతం ఎంతో తెలుసా?
అసలు ఏం జరుగుతోంది?
ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో క్యాతనపల్లి మున్సిపాలిటీలోని మొత్తం 22 వార్డుల్లో.. బీఆర్ఎస్ 10, కాంగ్రెస్ 7, సీపీఐ 4, స్వతంత్ర అభ్యర్థి ఒకరు గెలుపొందారు. దీంతో హంగ్ ఏర్పడింది. అయితే ఎన్నికలకు ముందే బీఆర్ఎస్, సీపీఐ కూటమిగా ఏర్పడ్డాయి. దీంతో ఇరువురు కలిసి 14 మంది సభ్యులతో పాలకవర్గాన్ని కైవసం చేసుకోవడం ఖాయమైంది. అయితే పీఠాన్ని ఎలాగైన దక్కించకోవాలనే ఉద్దేశంతో మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ ఎక్స్ అఫీషియో సభ్యులుగా పేరు నమోదు చేసుకున్నారు. వారికి స్వతంత్ర అభ్యర్థి కూడా మద్దతు ఇవ్వడంతో కాంగ్రెస్ బలం 10 స్థానాలకు పరిమితమైంది. అయితే రాష్ర్టంలో కాంగ్రెస్. సీపీఐల మధ్య అవగాహన ఉండటంతో క్యాతనపల్లిలోనూ సీపీఐ తమకు మద్దతు ఇస్తందని కాంగ్రెస్ నమ్ముతుంది. దానికోసమే ప్రయత్నిస్తుంది. ఈ విషయంలోనే రెండు రోజులుగా ఛైర్ పర్సన్ ఎంపిక వాయిదా పడుతోంది.అయితే ఈ రోజు ఎలాగైన ఎంపిక పూర్తి చేయాలని భావిస్తున్న అధికారులు ముందస్తుగా బీఆర్ఎస్ నేతలను అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో మరోసారి ఉద్రక్తత చోటు చేసుకుంది.
సభ్యుల ప్రమాణ స్వీకారం తర్వాత.. 10 నిమిషాలపాటు ఉన్నతాధికారులు విరామం ప్రకటించారు. ఈ సమయంలో కాంగ్రెస్ సభ్యుడు.. బీఆర్ఎస్ నేతలకు వద్దకు వెళ్లి మంతనాలు జరపడంతో అసలు గొడవకు దారితీసింది. అనంతరం చోటు చేసుకున్న వరుస పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
Also Read : సిటీ బస్సుల్లో ప్రయాణించేవారికి అదిరిపోయే శుభవార్త.. ఇక నుంచి ఆ బాధ పోయినట్లే!
Follow Us