హైదరాబాద్‌లో కలెక్టర్ల రహస్య సమావేశం సంచనంగా మారింది. బుధవారం ఓ స్టార్ హోటల్లో 20 నుంచి 23 మంది ఐఏఎస్ అధికారులు సమావేశమయ్యారు. సీనియర్ ఐఏఎస్ అధికారి అధ్యక్షతన మీ మీటింగ్ జరిగింది. ముఖ్యమంత్రి, మంత్రుల ఎవరూ చెప్పినా కూడా నోటి మాటగా ఏ పని చేయొద్దని కలెక్టర్లు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పెద్దలు తీసుకునే నిర్ణయాల వల్ల తాము బలవుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: భారత్‌లో లంచాలు..యూఎస్‌లో కేసులు ఎలా?అదానీని కావాలనే టార్గెట్ చేస్తున్నారా?
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో స్కామ్‌లతో పాటు మొన్నటి లగచర్ల ఘటనతో అధికారుల్లో ఆందోళ నెలకొంది. ఇప్పటికే లగచర్ల ఘటనలో సీఎస్, డీజీపీలకు జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) నోటీసులు జారీ చేసింది. ఇక కేసీఆర్ హయాంలో జరిగిన కాళేశ్వరం అవినీతి, ఫార్ములా ఈ రేసింగ్, జీఎస్‌టీ స్కామ్, ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో ఇప్పటికే పలువురు అధికారులు విచారణ ఎదుర్కొంటున్నారు. రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ విచారణ ఎదుర్కొంటున్నారు.
Also Read: కేసీఆర్ ఫ్యాన్స్ కు ఇక పండగే.. ఆ సినిమాలో గులాబీ బాస్ స్పెషల్ రోల్!
అలాగే ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా ఉన్నప్పుడు భూ కేటాయింపుల విషయంలో అక్రమాలకు పాల్పడినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం మండలం నాగారంలో భూదాన్ భూముల వ్యవహారంలో అక్రమాలు జరిగినట్లు పలు ఫిర్యాదులు వచ్చాయి. రూ.వందల కోట్ల విలువైన 42 ఎకరాలను అక్రమంగా బదిలీ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం దీనిపై విచారణ కొనసాగుతోంది. అయితే ఇప్పుడు కలెక్టర్ల రహస్య సమావేశం కూడా చర్చనీయాంశమవుతోంది. మరి వీళ్లు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటారా ? లేదా ? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
Also Read: ఆర్జే వెంచర్స్ రూ.150 కోట్ల బిగ్ స్కామ్.. 600 మందిని మోసం చేసిన కంపెనీ
Also Read: జగన్ కు చంద్రబాబు సర్కార్ బిగ్ షాక్.. అదానీ వ్యవహారంపై విచారణ?