Dil Raju: తెలంగాణ ప్రభుత్వంతో తెలుగు చిత్రసీమ జరిపిన చర్చలపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు బాధకరంగా ఉన్నాయని నిర్మాత దిల్ రాజు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో సినీ పరిశ్రమ సమావేశం సానుకూలంగానే జరిగిందని, అయినప్పటికీ దీనిపై కేటీఆర్ అభ్యంతరాలు వ్యక్తం చేయడం సరైనది కాదన్నారు. ఈ మీటింగ్ ఒకరిద్దరితో చాటుమాటున జరిగిన వ్యవహారం కాదని, అందరికీ తెరిచిన పుస్తకం లాంటిదేనని దిల్ రాజు అన్నారు. Also Read: బ్యాడ్ న్యూస్ ఫర్ ఇండియా.. హిట్‌మ్యాన్, కింగ్ రిటైర్ కావడం లేదు ఎలాంటి దాపరికాలు లేవు.. ఈ మేరకు తెలుగు చిత్ర పరిశ్రమ బాగోగుల గురించి అత్యంత స్నేహపూర్వకంగా, ఎలాంటి దాపరికాలు లేకుండా ఈ సమావేశం జరిగింది. దీనిపై తెలుగు చిత్ర పరిశ్రమ చాలా సంతృప్తిగా ఉంది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పయనంలో తెలుగు చిత్ర పరిశ్రమ భాగస్వామ్యాన్ని గుర్తించి.. రాష్ట్రాభివృద్ధికి, సామజిక సంక్షేమానికి మా బాధ్యతగా తగిన సహకారం అందజేయాలని సీఎం కాంక్షించారు. అందుకు అనుగుణంగానే మేము అంగీకరించాం. అదే సీఎం రేవంత్ బలమైన సంకల్పం.. హైదరాబాద్ ను గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ హబ్ గా తీర్చదిద్దాలనే సీఎం రేవంత్ బలమైన సంకల్పం. దానిని తెలుగు చిత్ర పరిశ్రమ ప్రతినిధులుగా మేమందరం స్వాగతించడం జరిగింది. అనవసర వివాదాల్లోకి తెలుగు చిత్ర పరిశ్రమను లాగి, పరిశ్రమకు లేనిపోని రాజకీయాలను ఆపాదించొద్దని మా మనవి. రాజకీయ దాడి, ప్రతిదాడులకు దయచేసి పరిశ్రమను వాడుకోవద్దని అందరిని కోరుతున్నాం. లక్షలాది మందికి జీవనోపాధి కల్పిస్తున్న తెలుగు చిత్ర పరిశ్రమకు అన్ని ప్రభుత్వాల సహకారం, ప్రజలందరి ప్రోత్సాహం ఎప్పటికీ ఉంటుందని ఆశిస్తున్నామని దిలు రాజు చెప్పారు. ఇది కూడా చదవండి: Maoist: అమిత్ షా సంచలన నిర్ణయం.. తెలంగాణలోకి 2వేల కేంద్ర బలగాలు! కేటీఆర్ ఎమన్నారంటే.. ఇక ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేలా సీఎం రేవంత్ సినిమా వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాడని కేటీఆర్ ఆరోపించారు. సినిమా వాళ్లతో సెటిల్ చేసుకున్నాక సైలెంట్ అయ్యారని విమర్శలు గుప్పించడం చర్చనీయాంశమైంది.