కవిత పేరుతో లెటర్ రాసింది ఆయనే.. BRS ఎమ్మెల్సీ దాసోజు సంచలన ఆరోపణలు

BRSలో చీలిక, KCRకు కవిత లేఖ అని వస్తున్న వార్తలపై ఆ పార్టీ ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ కుమార్ స్పందించారు. శ్రావణ్ కుమార్ RTVతో మాట్లాడుతూ.. కవిత ఆ లేఖ రాసిఉండదని అన్నారు. BRSని అస్థిర పరచాలనే ఉద్దేశ్యంతోనే రేవంత్ రెడ్డి క్రియేట్ చేశారని ఆయన ఆరోపించారు.

New Update

బీఆర్ఎస్ పార్టీలో చీలిక, కేసీఆర్‌కు కవిత లేఖ అని వస్తున్న వార్తలపై ఆ పార్టీ ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ కుమార్ స్పందించారు. వరంగల్ సభపై ఫీడ్ బ్యాక్ గురించి కవిత కేసీఆర్‌కు లెటర్ రాసింది. ఇది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత 6 పేజీల లేఖ రాసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలను దాసోజు శ్రావణ్ కుమార్ ఖండించారు. ఆ లెటర్ క్రియేట్ చేశారని ఆయన కొట్టిపారేశారు.

దాసోజు శ్రావణ్ కుమార్ ఆర్టీవీతో మాట్లాడుతూ.. కవిత ఆ లెటర్ రాయలేదని అన్నారు. బీఆర్ఎస్‌ పార్టీని అస్థిర పరచాలనే ఉద్దేశ్యంతోనే రేవంత్ రెడ్డి క్రియేట్ చేశారని ఆయన అంటున్నారు. బీఆర్ఎస్‌ను దెబ్బ తీయడానికే కాంగ్రెస్ పార్టీ కవిత పేరున ఓ లేఖ సృష్టించింది. ఒకవేళ ఆ లేఖ కవితే రాసి ఉంటే.. ఆమే రిలీస్ చేసేది అని ఆయన స్పష్టం చేశారు. గతకొన్ని రోజులుగా పార్టీని దెబ్బతీయాడానికి కాంగ్రెస్ డ్రామాలు ఆడుతుందని దాసోజు ఆరోపించారు. మొదట పార్టీలో కేటీఆర్, హరీశ్ రావులకు విభేదాలు ఉన్నాయిని, తర్వాత కేసీఆర్‌కు హరీశ్ రావుకు గొడవలు అవుతున్నాయని సృష్టించారు. ఇప్పుడు కవిత, కేసీఆర్‌ పట్ల అసంతృప్తిగా ఉన్నట్లు క్రియేట్ చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఇలాంటి గోబెల్స్ ప్రచారాలు చేస్తోందని దాసోజు శ్రావణ్ కుమార్ ఆర్టీవీతో చెప్పారు.  

(mlc kavitha | dasoju-shravan | Dasoju Sravan interview | Revanth Reddy | telangana | latest-telugu-news)

Advertisment
తాజా కథనాలు