/rtv/media/media_files/2025/10/31/cpiml-party-called-for-celebrations-of-41st-death-anniversary-of-chandra-pulla-reddy-2025-10-31-20-44-43.jpg)
CPI(ML) party called for celebrations of 41st death anniversary of Chandra Pulla reddy
నవంబర్ 9న కామ్రేడ్ చండ్ర పుల్లారెడ్డి 41వ వర్ధంతిని ఆయా జిల్లాల్లో విజయవంతం చేయాలని సీపీఐ(ఎంఎల్) పార్టీ పిలుపునిచ్చింది. నవంబర్ 1 నుంచి 8 వరకు అన్ని గ్రామాల్లో అమరవీరుల సంస్మరణ సభలను జరపాలని కోరింది. సీపీఐ(ఎంఎల్) ప్రతిఘటన కార్యదర్శి ఆనంద్ మాట్లాడుతూ.. ''కామ్రేడ్ చండ్ర పుల్లారెడ్డి తన జీవితకాలంలో అన్యవర్గ ధోరణులకు, నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. భారతదేశ నిర్దిష్ట పరిస్థితులను మార్క్సిజం, లెనినిజం, మావో ఆలోచన విధానాన్ని అమలుపరచి ప్రతిఘటన పోరాటం సూత్రాన్ని రూపొందించారు.
ఈ పోరాటం ద్వారా గిరిజనేతరులు, భూస్వాములకు, పెత్తందారులకు, పట్వారిలకు, ఫారెస్ట్ అధికారులకు వ్యతిరేకంగా పోరాడారు. చండ్ర పుల్లారెడ్డి తన పోరాటంలో మూడు లక్షల ఎకరాలను భూమిలేని పేదలు పంచారు. కేంద్ర కమిటీ ,రాష్ట్ర కమిటీలో కేంద్రీకృత ప్రజాస్వామ్యం ద్వారా అంతర్గత విభేదాలను పరిష్కరించేవారు. కామ్రేడ్ చారు మజుందార్ ప్రవేశపెట్టిన అతివాద సిద్ధాంతం 'వర్గ శత్రువు నిర్మూలన' ఓడించి గోదావరి లోయ ప్రతిఘటన పోరాటాన్ని, అడవి ఉద్యమాన్ని, ఆత్మరక్షణ దళాలను రక్షించాడు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విప్లవోద్యమాన్ని నాశనం చేయడానికి ఎన్ని కుట్రలు పన్నినా ప్రజలు ప్రతిఘటన పోరాటాన్ని రక్షించుకున్నారు.
Also read: బిగ్ షాక్.. ఆ వీడియోలు చేస్తే రూ.12 లక్షలు ఫైన్!
అడవి ప్రాంతంలో పోలీసు యంత్రాంగం, పారా మిలిటరీ దళాల నుండి విప్లవోద్యమాన్ని కాపాడుకున్నారు. కామ్రేడ్ సీపీ రెడ్డి విప్లవోద్యమాన్ని అడవి ప్రాంతంలో సంఘటితపరిచి ఇతర మైదాన ప్రాంతాలకు విస్తరించారు. సీపీఐ(ఎంఎల్) పార్టీని కొందరు నాయకులు అంతర్గతంగా నాశనం చేయడానికి కుట్రలు పన్నారు. కానీ ఈ కుట్రలను రాజకీయ, సిద్ధాంతాల ద్వారా నిర్దిష్టంగా విశ్లేషిస్తూ పార్టీలో అంతర్గతంగా చర్చకు పెట్టి తీవ్రమైన రాజకీయ పోరాటం ద్వారా వాళ్ల కుట్రలను భగ్నం చేశారు. దేవులపల్లి వెంకటేశ్వరరావు, సత్యనారాయణ సింగ్, పైలా వాసుదేవరావు, చంద్రం, రవి, వేములపల్లి వెంకటరామయ్య, డి.వి.కృష్ణారెడ్డి లాంటి మితవాద శక్తులను ఓడించి పార్టీని నిలబెట్టారు.
Also Read: గుడ్‌న్యూస్.. భారత్‌లో టెస్లా, స్టార్‌లింక్ ఉద్యోగాలు..
కామ్రేడ్ సీపీ రెడ్డి.. జాతీయ, అంతర్జాతీయ పరిస్థితులను ఎప్పటికప్పుడు విశ్లేషించి వ్యాసాలు రాసేవారు. కామ్రేడ్ సీపీ రెడ్డి రచించిన వ్యాసాలు ప్రస్తుతం సజీవంగా ఉన్నాయి. ఆ రాజకీయాలు ప్రస్తుత పరిస్థితులకు కూడా వర్తిస్తాయి. కామ్రేడ్ చండ్ర పుల్లారెడ్డి 41 వ వర్ధంతి సందర్భంగా అందరం కలిసి కామ్రేడ్ సీపీ రెడ్డి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్తామని'' పార్టీ కార్యదర్శి ఆనంద్ పిలుపునిచ్చారు.
Follow Us