Social Media Influencers: బిగ్ షాక్.. ఆ వీడియోలు చేస్తే రూ.12 లక్షలు ఫైన్!

సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని అరికట్టేందుకు చైనా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకువచ్చింది. ఇకపై ఆరోగ్య, ఆర్థిక, న్యాయం, విద్య వంటి అంశాలపై సలహాలు ఇచ్చే ఇన్‌ఫ్లుయెన్సర్లు తప్పనిసరిగా ఆయా రంగాల్లో విద్యార్హత కలిగి ఉండాలని నిబంధనను అమలులోకి తెచ్చింది.

New Update
social media influencers

ఇతరులు అడగకున్నా ఫ్రీగా ఇచ్చేవి ఏవైనా ఉన్నాయంటే అవి సలహాలు. ఏదైనా ఓ విషయంపై మాట్లాడుతున్నప్పుడు ఆ అంశంపై అవగాహణ లేకున్నా.. చాలామంది ఉచిత సలహాలు ఇస్తుంటారు. సోషల్ మీడియా ఉపయోగం పెరిగిపోయినా కొద్దీ ఈ కల్చర్ ప్రమాదకరంగా మారిపోయింది. డిజిటల్ క్రియేటర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు అంటూ లక్షల కొద్దీ కంటెంట్ క్రియేటర్ల పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారు. సగం సగం నాలెల్జ్‌తో ఇలాంటి వారు సమాచారాన్ని తప్పుదొవ పట్టిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఆరోగ్య, ఆర్థిక, న్యాయం, విద్య వంటి విషయాల్లో సబ్జెట్ లేకున్నా అడ్వైజ్‌లు ఇస్తుంటారు. అలాంటి వారికి చెక్ పెట్టడం కోసం చైనా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం వ్యాప్తిని అరికట్టేందుకు చైనా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకువచ్చింది. ఇకపై ఆరోగ్య, ఆర్థిక, న్యాయం, విద్య వంటి సున్నితమైన అంశాల గురించి మాట్లాడే లేదా సలహాలు ఇచ్చే ఇన్‌ఫ్లుయెన్సర్లు తప్పనిసరిగా ఆయా రంగాల్లో తగిన విద్యార్హత కలిగి ఉండాలని కొత్త నిబంధనను అమలులోకి తెచ్చింది. చైనా సైబర్‌స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (CAC) ప్రవేశపెట్టిన ఈ కఠినమైన చట్టం అక్టోబర్ 25 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. ఇలాంటి నిబంధనలు భారత్‌లో కూడా తీసుకురావాలని సోషల్ మీడియాలో నెటిజన్లు కోరుకుంటున్నారు. చైనా ప్రభుత్వం నిర్ణయం గురించి వస్తున్న వార్తలపై భారతీయ నెటిజన్లు స్పందిస్తున్నారు. ఇండియాలో కూడా డిజిటల్ క్రియేటర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లకు కచ్చితంగా సంబంధిన సబ్జెట్‌లో డిగ్రీ ఉండాలని కోరుకుంటున్నారు. అలా లేకపోవడంతో ఎవరు పడితే వారు ఇష్టవచ్చినట్లుగా ఇంటర్‌నెట్‌లో వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

కొత్త నిబంధనల వివరాలు ఏమిటి?

ఇన్‌ఫ్లుయెన్సర్లు ఏదైనా నియంత్రిత అంశం గురించి కంటెంట్ పోస్ట్ చేయాలనుకుంటే, వారు ఆమోదించబడిన డిగ్రీ, ప్రొఫెషనల్ లైసెన్స్ లేదా సర్టిఫికేషన్ వంటి రుజువులను తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుంది. వైద్య సలహాలు ఇవ్వాలంటే వైద్యుడిగా రిజిస్ట్రేషన్, చట్టపరమైన విషయాలపై వ్యాఖ్యానించాలంటే న్యాయవాదిగా అర్హత చూపించాల్సి ఉంటుంది.

ఉల్లంగిస్తే జరిమానా

డౌయిన్ (టిక్‌టాక్ చైనా వెర్షన్), వీబో, బిలిబిలి వంటి ప్రధాన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు తమ క్రియేటర్ల అర్హతలను ధృవీకరించాలి. అంతేకాకుండా, పోస్టులలో ఉపయోగించిన సమాచారానికి ఆధారాలు, డిస్‌క్లెయిమర్‌లు ఉండేలా చూడాలి. విద్య పేరుతో మెడికల్ ఉత్పత్తులు, సప్లిమెంట్లను రహస్యంగా ప్రమోట్ చేయడాన్ని కూడా ప్రభుత్వం నిషేధించింది. ఈ నిబంధనలను పాటించడంలో విఫలమైతే, సదరు ఇన్‌ఫ్లుయెన్సర్‌ల ఖాతాలను సస్పెండ్ చేయడంతో పాటు భారీ జరిమానాలను కూడా విధించే అవకాశం ఉంది. ఇన్‌ఫ్లూయెన్సర్‌‌కు డిగ్రీ సర్టిఫికేట్ లేకుండా సూచనలు ఇస్తూ వీడియోలు చేస్తే ఆయనా ప్లాట్‌ఫారమ్‌లకు 100,000 యూవాన్లు ($14,000) వరకు జరిమానా విధించబడుతుంది. ఇండియన్ కరెన్సీలో ఇది రూ.12 లక్షలు.

Advertisment
తాజా కథనాలు