/rtv/media/media_files/2025/01/21/LtN0m6fEa2LS2QcFfnC1.jpg)
Surgery (File Photo)
హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో అలకనంద మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో కిడ్నీ రాకెట్ వ్యవహారం సంచలనం రేపింది. ఎలాంటి పర్మిషన్ లేకుండానే కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు జరుగుతున్నాయనే విషయం పోలీసులు దృష్టికి వచ్చింది. దీంతో మంగళవారం సాయంత్రం ఎల్బీనగర్ పోలీసులు ఆస్పత్రిలో తనిఖీలు చేశారు. వివిధ రాష్ట్రాలకు చెందిన అమాయకులకు డబ్బులను ఆశ చూపిస్తూ.. ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన వైద్యులతో కిడ్నీ మార్పిడి చికిత్సలు చేస్తూ డబ్బులు దండుకుంటున్నట్లు విచారణలో తేలింది.
Also Read: మహమ్మద్ ప్రవక్తను అవమానించాడని పాప్ సింగర్‌కు మరణ శిక్ష...ఎక్కడో తెలుసా!
కర్ణాటకకు చెందిన ఇద్దరు, తమిళనాడుకు చెందిన ఇద్దరికీ ఈ కిడ్నీ మార్పిడి చికిత్సలు జరిగినట్లు గుర్తించారు. తమిళనాడుకు చెందిన ఇద్దరు మహిళలు కిడ్నీలు ఇవ్వగా.. వాళ్లని కర్ణాటకకు చెందిన మరో ఇద్దరికి అమర్చినట్లు పోలీసులు తేల్చారు. కిడ్నీ దాతలతో సహా.. ఇద్దరు రోగులను పోలీసులు సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే 6 నెలల క్రితమే అలకనంద ఆస్పత్రి ప్రారంభమైందని పోలీసులు తెలిపారు.
Also read: ట్రంప్ నిర్ణయంతో 36 లక్షల ఇండో అమెరికన్లకు నష్టం
ఇద్దరు వైద్యులతోనే చిన్న చిన్న శస్త్ర చికిత్సలు చేసేందుకు మాత్రమే పర్మిషన్ ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే ఇటీవలే రోగులకు కిడ్నీ మార్పిడి చికిత్స జరగడంతో వాళ్లు అనారోగ్యానికి గురికాకుండా ముందస్తు జాగ్రతల కోసం సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. అయితే తాజాగా అలకనంద ఆస్పత్రిని సీజ్ చేసినట్లు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి వెంకటేశ్వర్లు చెప్పారు. అలాగే ఆస్పత్రి ఎండీ అయిన సుమంత్ చారీ, ఆస్పత్రి సిబ్బందిని కూడా అరెస్టు చేసినట్లు పోలీసులు స్పష్టం చేశారు.
Also Read: ఇండియాలో 26 శాతం ఉద్యోగాలు AI కారణంగా ప్రభావితం
Also Read: విషాదం.. ఏపీకి చెందిన ఆర్మీ జవాన్ మృతి