/rtv/media/media_files/2025/09/05/jump-2025-09-05-15-12-48.jpg)
పశ్చిమ బెంగాల్‌లో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. అత్తమామలకు మత్తు మందు ఇచ్చి ఎదురింటి వ్యక్తితో పారిపోయారు ఇద్దరు తోటి కోడళ్లు. నార్త్ 24 పరగణాలలోని బాగ్డా పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటుచేసుకుంది. మలిడా గ్రామానికి చెందిన యాసిన్ షేక్, అనిసూర్ షేక్ సోదరులున్నారు. వీరి భార్యలు కుల్చన్ మల్లిక్, నజ్మా మండల్. అయితే వీరిద్దరూ ఎదురింట్లో ఉంటున్న వివాహితుడైన ఆరిఫ్‌తో వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. ఆరిఫ్ తన భార్యను వదిలేసి ఒంటరిగా ఉంటున్నాడు.
సోమవారం అత్తమామలు, పిల్లలకు టీలో మత్తు మందు ఇచ్చిన కోడళ్లు.. తమ భర్తలను కూడా వదిలేసి ఆరిఫ్‌తో వెళ్లిపోయారు. దీంతో విషయం తెలుసుకున్న అనిసూర్ బాగ్డా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. వారి దర్యాప్తు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని మొబైల్ నెట్‌వర్క్ సమాచారం ఆధారంగా మహిళలను గుర్తించి వారిని తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇచ్చారు. కాగా అనిసూర్ ఒక గ్యారేజీలో పనిచేస్తుండగా, యాసిన్ షేక్ విదేశాల్లో ఉన్నారు.
షాక్ అయిన పోలీసులు
అయితే కౌన్సిలింగ్ లో ఇద్దరు కోడళ్లు చెప్పిన సమాధానం విని పోలీసులు షాకయ్యారు. తాము ఇద్దరం అతన్ని ప్రేమించామని తమకే అతగాడే కావాలని ఇద్దరూ చెప్పడం గమనార్హం. అయితే ఇక్కడ సంతోషించదగ్గ పరిణామం ఏంటంటే.. అతగాడి కోసం వీరిద్దరూ తమ కుటుంబ సభ్యులను చంపలేదు. ఇతరులను ఇన్సిసిరేషన్ గా తీసుకుని ఉంటే తమ ప్రాణాలు పోయేవని అంటున్నారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది.
మహారాష్ట్రలో దారుణం
మహారాష్ట్రలో మరో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన భార్యను హత్య చేసి.. ఆమె శరీరాన్ని ముక్కలుగా చేసి సముద్రంలో పారేశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భివండికి చెందిన మహమ్మద్ తాహా అలియాస్ సోను ఇంతియాజ్ అన్సారీ, పర్వీన్ అలియాస్ ముస్కాన్‌ను సోషల్ మీడియా ద్వారా పరిచయం చేసుకుని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వారికి ఒక కొడుకు కూడా ఉన్నాడు. అయితే.. తరచుగా వారి మధ్య గొడవలు జరిగేవి. ఇంటిని వేరుగా పెట్టుకునే విషయంలో ఆగస్టు 28న దంపతుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
ఈ గొడవ తర్వాత ముస్కాన్ ఇంటిని విడిచి వెళ్లిపోయింది. ఆగస్టు 29న మళ్ళీ ఇద్దరి మధ్య గొడవ జరిగి తాహా కోపంతో తన భార్యను హత్య చేశాడు. సాక్ష్యాలను మాయం చేయడానికి ఆమె శరీరాన్ని ముక్కలుగా నరికి సముద్రంలో పారేశాడు. ఆగస్టు 30న ఈద్గా జుగ్గి-జోపాడి ప్రాంతంలో ఒక మహిళ యొక్క తల మాత్రమే లభించడంతో కేసు దర్యాప్తు ప్రారంభమైంది. విచారణలో ఆ తల ముస్కాన్‌ది అని గుర్తించారు. ముస్కాన్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. విచారణలో అసలు విషయం బయటపడింది.
Also Read : Viral video: నీకు ఎంత ధైర్యం?.. IASకు డిప్యూటీ సీఎం బెదిరింపులు.. వీడియో వైరల్!