Bathukamma Festival : రేవంతన్న గుడ్ న్యూస్... ఒక్కో మహిళకు రెండేసి చీరలు.. ధరెంతో తెలుసా?

బతుకమ్మ పండుగకు ముందుగానే మహిళలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇందిరా మహిళా శక్తి పథకం కింద ‘అక్క-చెల్లెళ్లకు మీ రేవంతన్న కానుక’ పేరుతో చేనేత చీరల పంపిణీ చేయనుంది.

New Update
cm revanth saree

బతుకమ్మ పండుగ(Bathukamma Festival) కు ముందుగానే మహిళలకు రేవంత్(Revanth Reddy) సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇందిరా మహిళా శక్తి పథకం కింద ‘అక్క-చెల్లెళ్లకు మీ రేవంతన్న కానుక’ పేరుతో చేనేత చీరల పంపిణీ చేయనుంది. గత ప్రభుత్వం ఒక్కొక్కరికి ఒక చీర ఇస్తే ఈ ఏడాది  ప్రతి మహిళకు రెండేసి చీరలు(Sarees) ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే అవి ఇలాంటి అలాంటి చీరలు కాదు. ఒక్కోటి రూ.800 ఖర్చుతో కూడిన చీరలను అందజేయనుంది.

అంటే ఈ లెక్కన ఒక్కొ మహిళకు రూ.1600 విలువైన రెండు చీరలు దక్కనున్నాయన్న మాట. బతుకమ్మ పండుగ ఈ నెల 21వ తేదీ నుంచి ప్రారంభం కానుండగా, ప్రభుత్వం ముందుగానే ఈ చీరల పంపిణీని పూర్తి చేయాలని ఫిక్స్ అయింది. ఈ చీరలను చేనేత సహకార సంఘాల ద్వారా తయారు చేసి సరఫరా చేయించనుంది. దీని వలన చేనేత కార్మికుల కు ఉపాధి లభించడం మాత్రమే కాకుండా.. రాష్ట్రంలో స్థానిక హ్యాండ్‌లూమ్ పరిశ్రమకు ఊతం లభిస్తోంది. 

Also Read :  అల్లు కనకరత్నమ్మ దశదినకర్మ.. పవన్, కేటీఆర్ సహా ప్రముఖుల నివాళులు

సెప్టెంబర్ 15 లోపు ఈ చీరలు

మరోవైపు.. పండుగ సమయంలో ప్రతి ఇంటిలో మహిళలు సంతోషంగా పాల్గొనడానికి ఈ కార్యక్రమం తోడ్పడనుంది. అధికారులు ఇప్పటికే డీఆర్డీవో ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని సభ్యుల వివరాలు, మెప్మా ద్వారా నగర ప్రాంతాల సభ్యుల వివరాలు సేకరించాలని సూచనలు ఇచ్చారు.2025 సెప్టెంబర్ 15 లోపు ఈ చీరలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఒకేసారి అన్ని చీరలు ఇస్తారా లేకా దసరా తరువాత మరో చీర ఇస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. మహబూబ్‌నగర్‌, జోగులాంబ గద్వాల, వనపర్తి, నారాయణపేట, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో 3,39,110 మంది మహిళలకు 6,78,220 చీరలు కావాలన్న మాట. మొత్తం 4,52,780 మందికి 9,05,560 చీరలు పంపిణీ చేయాలని ప్లాన్ చేశారు.

Also Read :  సోషల్ మీడియాలో నటి అశ్లీల వీడియోలు...ఆమె ఏం చేసిందంటే..?

Advertisment
తాజా కథనాలు