TG SSC Exam : పదో తరగతి పరీక్షల్లో గందరగోళం ఒక పేపర్ కు బదులు మరో పేపర్

తెలంగాణలో పదో తరగతి పరీక్షలు మొదలయ్యాయి. అయితే పరీక్షలు ప్రారంభమైన తొలిరోజే  గందరగోళం నెలకొంది. పరీక్షల్లో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. ఒక ప్రశ్నా పత్రానికి బదులు మరో ప్రశ్నాపత్రం ఇవ్వడంతో పరీక్ష రెండు గంటలు ఆలస్యంగా మొదలైంది.

author-image
By Kusuma
New Update
telangana 1oth class exams

telangana 1oth class exams

TG SSC Exam : తెలంగాణలో పదో తరగతి పరీక్షలు మొదలయ్యాయి. అయితే పరీక్షలు ప్రారంభమైన తొలిరోజే  గందరగోళం నెలకొంది. పరీక్షల్లో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. ఒక ప్రశ్నా పత్రానికి బదులు మరో ప్రశ్నాపత్రం ఇవ్వడంతో పరీక్ష రెండు గంటలు ఆలస్యంగా మొదలైంది.  తెలుగు పేపర్‌కు బదులు విద్యార్థులకు హిందీ పేపర్ ఇచ్చిన ఘటన సంచలనం రేపింది. ఒక సబ్జెక్ట్‌కు ప్రిపేర్ అయితే మరో సబ్జెక్ట్ పేపర్ రావడంతో విద్యార్థులు ఒకింత ఆందోళనకు గురయ్యారు. మంచిర్యాలలోని బాయ్స్ హై స్కూల్‌లో జరిగిన ఈ ఘటనలో తెలుగు పేపర్‌ కు  బదులు హిందీ పేపర్‌ వచ్చింది గమనించకుండా.. సెంటర్ నిర్వాహకులు పరీక్ష నిర్వహించారు.  ఆ తర్వాత నాలుక్కరుచుకుని  విషయాన్ని అక్కడి అధికారులకు తెలియజేయంతో జరిగిన తప్పిదాన్ని గుర్తించారు. వెంటనే మరో పేపర్ తెప్పించి పరీక్ష రాయించారు. అయితే అప్పటికే రెండు గంటలు గడిచిపోయింది.  

Also Read: అమెరికా విద్యాశాఖ మూసివేత..కీలక ఆదేశాలు జారీ చేసిన ట్రంప్‌!

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్‌ బాయ్స్‌ హైస్కూల్‌లో అధికారుల నిర్లక్ష్యం వల్ల  రెండు గంటలు ఆలస్యంగా పదో తరగతి పరీక్షలు మొదలయ్యాయి. ఉదయం విద్యార్థులంతా పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. పరీక్ష హాల్లో తమకు కేటాయించిన సీట్లలో కూర్చుకున్నారు. పరీక్షలు రాసేందుకు సిద్ధమయ్యాయి. అక్కడి ఇన్విజిలేటర్లు ప్రశ్నాపత్రాన్ని విద్యార్థులకు ఇచ్చారు. అయితే ఆ ప్రశ్నాపత్రాన్ని చూసి విద్యార్థులంతా అవాక్కయ్యారు.  ఒక ప్రశ్నాపత్రానికి బదులుగా మరో పేపర్‌ను అధికారులు పంపిణీ చేశారు. విద్యార్థులు దాన్ని గుర్తించి చెప్పడంతో అధికారులు హైరానా పడ్డారు. హడావుడిగా మరో పేపర్ తెప్పించడంతో దాదాపు రెండు గంటలు ఆలస్యంగా విద్యార్థులు పరీక్ష రాశారు. పరీక్షా సమయం పూర్తయినా విద్యార్థులు.. బయటికి రాకపోవడంతో తల్లిదండ్రుల ఆందోళనకు గురయ్యారు.

Also Read: హైకోర్టు జడ్జి వ్యాఖ్యలు బాధాకరం.. మైనర్ బాలిక ఇష్యూపై కేంద్రమంత్రి అసహనం!

కలెక్టర్ సీరియస్


కాగా ఈ విషయం తెలిసి ఎగ్జామ్ సెంటర్‌కు వచ్చిన జిల్లా కలెక్ట్ కుమార్ దీపక్‌ విద్యాధికారుల తీరుపై సీరియస్‌ అయ్యారు. ప్రశ్నాపత్రాల విషయంలో సిబ్బంది నిర్లక్ష్యం, పరీక్ష ఆలస్యంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ప్రశ్నాపత్రం బదులు మరో పేపర్ రావడంతో వెంటనే విచారణ జరిపి నివేదిక అందించాల్సిందిగా డీఈవోకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. పదో తరగతి పరీక్షల ప్రశ్నాపత్రాల విషయంలో అధికారుల నిర్లక్ష్యం పట్ల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు.

 Also Read :  తెలంగాణ హైకోర్టుకు యాంకర్‌ శ్యామల!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు