CM Revanth: 42 శాతం బీసీ రిజర్వేషన్ మోదీ మెడలు వంచి తీసుకుందాం.. రేవంత్ సంచలన వ్యాఖ్యలు

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్‌ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్‌ వద్ద కాంగ్రెస్ నేతలు బీసీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

New Update
CM Revanth

CM Revanth

బీసీలకు 42 శాతం రిజర్వేషన్(bc-reservation) కల్పించాలని డిమాండ్‌ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్‌ వద్ద కాంగ్రెస్ నేతలు బీసీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ (CM Revanth) సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ, బీజేపీ నాయకులు బీసీ రిజర్వేషన్‌ బిల్లును అడ్డుకొని బలహీన వర్గాలకు అన్యాయం చేస్తున్నారంటూ మండిపడ్డారు. తెలంగాణలో బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామంటే గుజరాత్‌ వాళ్లకు ఎందుకు కడుపు మంట అంటూ ధ్వజమెత్తారు. గల్లీలో ఉండలేకే చలో డిల్లీ చేపట్టామని పేర్కొన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధిస్తామని తెలిపారు. ఢిల్లీలో తాము చేస్తున్న నిరసనకు వందమంది ఎంపీలు, ఇండియా కూటమి పార్టీలు మద్దతిచ్చినట్లు పేర్కొన్నారు .  

Also Read: సృష్టి ఫెర్టిలిటీ కేసులో బిగ్‌ ట్విస్ట్‌..విదేశాలకు పారిపోతుండగా మరో డాక్టర్‌ అరెస్ట్‌

Revanth Reddy Comments On PM Modi

'' భోజనం మానేసి ధర్నా చేస్తున్నాం. మోదీ, ఎన్డీయేకు సవాలు చేస్తున్నా. మా డిమాండ్‌ను మీరు ఆమోదిస్తారా ? లేదా మిమ్మల్ని గద్దె దించాలా ?. మా ఆలోచనలు, బిల్లులు తుంగలో తొక్కే హక్కు మీకెవరిచ్చారు. ఈ రిజర్వేషన్లపై రెండు చట్టాలు చేసి కేంద్రానికి, గవర్నర్‌కి పంపించాం. రెండు చట్టాలపై ఆమోదం రాలేదు. తేల్చుకుందాం రండీ అని చలో ఢిల్లీ చేపట్టాం. 42 శాతం రిజర్వేషన్లు మోదీ మెడలు వంచి తీసుకుందాం. ఈ ధర్నాతో సంపూర్ణ విశ్వాసం కలిగింది. రిజర్వేషన్లు పొంది తీరుతాం. పార్టీని గెలిపిస్తే.. కులగణ చేస్తామని రాహుల్ గాంధీ మాట ఇచ్చారు. మాట ప్రకారమే కామారెడ్డిలో డిక్లరేషన్ ప్రకటించి బిల్లు ప్రవేశ పెట్టాం . 

Also Read: నెలకు రూ.60 వేల జీతంతో SBIలో క్లర్క్ ఉద్యోగాలు.. లాస్ట్ డేట్ ఆ రోజే!

42 శాతం రిజర్వేషన్ల చట్టంపై సవాలు విసిరాం. మోదీకి బలహీన వర్గాలకు న్యాయం చేయాలనే ఆలోచన లేదు. ఆయన మోచేతి నీళ్లు తాగే కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌, రామచంద్రరావుకు ఏమైంది ?.మీరు తెలంగాణ బలహీన వర్గాల ఓట్లు అడగలేదా ? ఇప్పుడు మీకు ఆ ప్రజల అవసరం తీరిపోయింది. బీఆర్ఎస్‌ పేగుబంధం కూడా తెలంగాణతో తెగిందా ?. మోదీ గద్దె మీద ఉండాలంటే 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలి. లేదంటే మేమే గద్దె దించడం ఖాయం. రానున్న ఎన్నికల్లో ఎన్డీయేకి 150 సీట్ల కంటే ఎక్కువ రానియ్యం. రాహుల్ గాంధీని ప్రధానిని చేస్తాం. ఎస్సీ, ఎస్టీలు  ఇందిరమ్మను అమ్మగా కొలుస్తారు.70 ఏళ్ల తెలంగాణ కలను సోనియాగాంధీ నెరవేర్చారు. దేశం కోసం అమరులైన కుటుంబం గాంధీ కుటుంబమని'' రేవంత్ రెడ్డి అన్నారు . 

Also Read: సీఎం పేర్లతో పథకాలు.. మద్రాస్‌ హైకోర్టు తీర్పును ఖండించిన సుప్రీంకోర్టు

Advertisment
తాజా కథనాలు