తెలంగాణ అసెంబ్లీలో అధికార, విపక్ష నేతల మధ్య వాడివేడిగా వాదనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. '' గత ప్రభుత్వం కొంతమందికి లబ్ధి చేకూర్చడానికే ఓఆర్‌ఆర్ టెండర్లను వాళ్లకు కట్టబెట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్‌కు మణిహారంగా ఎయిర్‌పోర్టుతో పాటు ఓఆర్‌ఆర్ నిర్మించింది. కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాల వల్లే రాష్ట్రానికి 65 శాతం ఆదాయం వస్తోందని'' సీఎం రేవంత్ అన్నారు. Also Read: కేటీఆర్ పై ఏసీబీ కేసు.. ఏ క్షణమైనా అరెస్ట్? విపక్ష పార్టీ కోరిక మేరకు ఔటర్ రింగ్ రోడ్ టోల్ కాంట్రాక్టుపై ప్రత్యేక విచారణ బృందాన్ని(SIT) ఏర్పాటు చేస్తామని అన్నారు. హరీశ్ రావు కోరిక మేరకు సభ్యులందరి ఆమోదంతో పూర్తిస్థాయి విచారణకు ఆదేశిస్తున్నామని పేర్కొ్నారు. ఈ అంశంపై మంత్రివర్గంలో చర్చించి విధివిధానాలను రూపొందిస్తామని తెలిపారు. Special Investigation Team to be constituted to probe Outer Ring Road Toll tenders - CM Revanth Reddy pic.twitter.com/qLQPJpu8NV — Naveena (@TheNaveena) December 19, 2024 ఇదిలాఉండగా.. అసెంబ్లీలో సభా కార్యకలాపాలపై సభ్యలకు సరిగ్గా సమాచారం ఇవ్వడం లేదని విపక్షాలు అసంతృప్తి చేశాయి. ఎలాంటి సమాచారం లేకుండానే ఆర్థిక పరిస్థితిపై చర్చ పెట్టారంటూ విమర్శలు చేశాయి. దీంతో అధికార, విపక్ష నేతల మధ్య సభలో తీవ్ర వాగ్వాదం జరగడంతో కాసేపు గందరగోళం ఏర్పడింది. Also Read: అమిత్ షాపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలి: మంత్రి పొన్నం Also Read: పునర్వివాహం చేసుకున్న మహిళకు ఆస్తిలో వాటా.. హైకోర్టు సంచలన తీర్పు