BIG BREAKING: కేటీఆర్ పై ఏసీబీ కేసు.. ఏ క్షణమైనా అరెస్ట్?

ఫార్ములా ఈ-కారు రేస్ వ్యవహారంలో కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది. A1గా కేటీఆర్, A2గా అర్వింద్ కుమార్, A3గా బీఎల్ఎన్ రెడ్డిని ఈ కేసులో నిందితులుగా ఏసీబీ పేర్కొంది. 4 సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.

author-image
By srinivas
New Update
ది ఆద ఆఇఆ

ఇ ఆఆఇఆఇఆ Photograph: (ఇఒఆఆఆఇఆ)

Formula e-car race: ఫార్ములా ఈ-కారు రేస్ వ్యవహారంలో కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది. A1గా కేటీఆర్, A2గా అర్వింద్ కుమార్, A3గా బీఎల్ఎన్ రెడ్డిని ఈ కేసులో నిందితులుగా ఏసీబీ పేర్కొంది. 4 సెక్షన్ల కింద  నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రివెన్షన్ ఆఫ్ కరెక్షన్ యాక్ట్ కింద కేసులు ఫైల్ చేసిన అధికారులు.. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేసినట్లు ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు. 13 (1A), 13(2), 409,120 సెక్షన్ల ప్రకారం కేసులు నమోదయ్యాయి. 

న్యాయపరమైన చిక్కులు రాకుండా ప్లాన్ ..

ఈ మేరకు హైదరాబాద్ బంజారాహిల్స్‌‌‌‌లోని ఈడీ ఏసీబీ ఆఫీస్‌‌‌ కేంద్రంగా డైరెక్టర్ నేతృత్వంలో సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్(సీఐయూ) ఆధ్వర్యంలో ఈ కేసును దర్యాప్తు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఏసీబీ ఉన్నతాధికారులు సమావేశం నిర్వహించి అరెస్టుకు సంబంధించిన ప్రణాళిక సిద్ధం చేసినట్లు సమాచారం. ఇక విచారణ టైమ్‎లో న్యాయపరమైన చిక్కులు రాకుండా లీగల్ ఒపీనియన్ తీసుకుందని, హైప్రొఫైల్ కేసు కావడంతో వివరాలు రహస్యంగా ఉంచుతున్నట్లు సంబంధిత వర్గాల్లో చర్చ నడుస్తోంది. నోటీసులు ఇవ్వగానే కేటీఆర్ సహా మిగతా వాళ్లను హెడ్ క్వార్టర్స్‎లోనే ప్రశ్నించేందుకు రంగం సిద్ధం చేసిన ఏసీబీ.. దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. 

అక్రమంగా రూ.55 కోట్లు..

ఈ ఫార్ములా–ఈ రేస్ కార్ల ఇష్యూలో విదేశీ సంస్థలకు రూ.55 కోట్లు అక్రమంగా చెల్లించారని ఆరోపణలున్నాయి. దీనిపై అప్పటి మున్సిపల్ శాఖ సెక్రటరీ అర్వింద్​ కుమార్‎కు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. దీంతో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ​ఆదేశాల మేరకే  తాను చెల్లింపులు చేసినట్టు అర్వింద్ బయటపెట్టారు. విదేశాల్లో ఉన్న కంపెనీకి ఆర్బీఐతో పాటు ఇతరత్రా ఎలాంటి పర్మిషన్లు లేకుండానే చెల్లింపులు చేశారని తెలిపారు. సీజన్​10 విషయంలో నిబంధనలు పాటించలేదని, నిధులు పంపిన 18 రోజులకు ఎన్నికల కోడ్​ టైంలో ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈసీ నుంచి ఎలాంటి పర్మిషన్లు తీసుకోకపోవడంతో హెచ్ఎండీఏపై రూ.200 కోట్ల భారం పడిందని చెప్పారు. 

Also Read: వాళ్లకోసమే ORR టెండర్లు కట్టబెట్టారు.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

మొత్తం రూ.200 కోట్లు 
ఇక 2023 ఫిబ్రవరి 11న హైదరాబాద్‎లో ఫార్ములా–ఈ కార్‌‌‌‌‌‌‌‌ రేస్ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగింది. మొత్తం రూ.200 కోట్లు ఖర్చు చేశారు. ఈవెంట్‌‌‌‌ నిర్వాహక సంస్థలైన గ్రీన్‌‌‌‌కో రూ.150 కోట్లు, హైదరాబాద్‌‌‌‌ రేసింగ్‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌ రూ.30 కోట్లు ఖర్చు చేశాయి. హెచ్‌‌‌‌ఎండీఏ రూ.20 కోట్లు ఖర్చు చేసింది. సీజన్ 9 విజయవంతం కావడంతో సీజన్‌‌‌‌ 10 నిర్వహించేందుకు ఫార్ములా–ఈ ఆపరేషన్‌‌‌ ‌(ఎఫ్‌‌‌‌ఈవో)తో మున్సిపల్ శాఖ 2023 అక్టోబర్‌‌‌‌‌‌‌‌లో అగ్రిమెంట్‌ కుదుర్చుకోగా అగ్రిమెంట్‎కు ముందే ఎన్నికల కోడ్ ​అమల్లో ఉండగానే రూ.55 కోట్లను హెచ్ఎండీఏ చెల్లించడం వివాదాస్పదమైంది. 

Also Read: కేటీఆర్ పై ఏసీబీ కేసు.. ఏ క్షణమైనా అరెస్ట్?

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు