TG News : అదానీ గ్రూపుపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. స్కిల్స్ ఇండియా యూనివర్సిటీకి అదానీ ప్రకటించిన రూ.100 కోట్లు విరాళాన్ని తిరస్కరించినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దీనిపై ఆ గ్రూపునకు లేఖ పంపినట్లు చెప్పారు. అనవసర వివాదాల్లోకి లాగొద్దు..
Also Read : 🔴IPL Auction Day -2: ఐపీఎల్ మెగా వేలం.. లైవ్ అప్డేట్స్!
Adani - Revanth Reddy
‘అదానీ విషయంలో కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి. అదానీ నుంచి తెలంగాణ ప్రభుత్వం నిధులు స్వీకరించిందని కొందరు విమర్శలు చేస్తున్నారు. రాజ్యాంగ బద్ధంగా, చట్టబద్ధంగానే అదానీ నుంచి పెట్టుబడులు అనుమతిస్తాం. నిబంధనల మేరకే టెండర్లు పిలిచి ప్రాజెక్టులు ఇస్తున్నాం. దేశంలో ఏ సంస్థలకైనా చట్టబద్ధంగా వ్యాపారం చేసుకొనే హక్కు ఉంటుంది. అంబానీ, అదానీ, టాటా.. ఎవరికైనా తెలంగాణలో వ్యాపారం చేసుకొనే హక్కు ఉంది. గొప్ప సంకల్పంతో లక్షలాది మంది నిరుద్యోగులకు సాంకేతిక నైపుణ్యం నేర్పించే లక్ష్యంతో స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించాం. గొప్ప సదుద్దేశంతో ప్రారంభించిన ఈ వర్సిటీ వివాదాలకు లోను కావడం మంత్రివర్గ సహచరులకు, నాకు, ప్రభుత్వానికి ఇష్టంలేదు. అదానీ గ్రూపు స్కిల్స్ వర్సిటీకి ఇచ్చిన విరాళాన్ని సీఎం, మంత్రులకు ఇచ్చినట్లు కొందరు ప్రచారం చేస్తున్నారు. సీఎస్‌ఆర్ కింద స్కిల్స్ వర్సిటీకి అదానీ గ్రూప్ ప్రకటించిన రూ.100 కోట్లు బదిలీ చేయొద్దని కోరుతూ ఆ గ్రూపునకు లేఖ పంపాం. అనవసర వివాదాల్లోకి రాష్ట్ర ప్రభుత్వాన్ని లాగొద్దు. తెలంగాణ ప్రభుత్వ ఖాతాల్లోకి ఎవరి నుంచీ డబ్బులు రాలేదు’ అని సీఎం రేవంత్ వివరించారు.
ఇది కూడా చదవండి: KTR: తప్పు జరిగింది.. పొరపాటైంది: లగచర్ల మహాధర్నాలో కేటీఆర్
ఇక తన ఢిల్లీ పర్యటనపై విమర్శలు చేస్తున్న వారికి కూడా సమాధానం ఇచ్చారు సీఎం రేవంత్. ఢిల్లీ పర్యటనకు రాజకీయాలతో సంబంధంలేదని, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె వివాహం కోసమే ఢిల్లీ వెళ్లినట్లు చెప్పారు. పార్లమెంటు సమావేశాలపై ఎంపీలతో మంగళవారం చర్చిస్తాం. అందుబాటులో ఉన్న కేంద్ర మంత్రులను రేపు కలిసి రాష్ట్ర సమస్యల్ని వివరిస్తాం. 28 సార్లు ఢిల్లీ వెళ్లానని కొందరు విమర్శిస్తున్నారు. నేను వారిలా పైరవీలు చేయడానికో.. బెయిల్ కోసం ఢిల్లీకి వెళ్లలేదు. కేంద్రం నుంచి మనకు రావాల్సినవి రాబట్టుకోవాలి. అవసరమైతే ఢిల్లీకి ఎన్నిసార్లయినా వెళ్తాం. బీఆర్‌ఎస్ సర్కారు అదానీకి గతంలో ఎన్నో ప్రాజెక్టులు ఇచ్చింది. అదానీతో బీఆర్‌ఎస్ సర్కారు అంటకాగింది. అదానీ వద్ద వాళ్లు కమీషన్లు తిన్నారు. కేటీఆర్ జైలుకు వెళ్లాలని తహతహలాడుతున్నారు. జైలుకెళ్తే సీఎం అవ్వొచ్చని అనుకొంటున్నారు. కేసీఆర్ కుటుంబం నుంచి ఇప్పటికే కవిత జైలుకు వెళ్లారు. జైలుకెళ్లినవారు సీఎం అయ్యేదుంటే ముందు కవిత అవుతారు. కేసీఆర్ కుటుంబంలో సీఎం సీటు కోసం పోటీ ఎక్కువగా ఉందంటూ విమర్శలు గుప్పించారు.
ఇది కూడా చదవండి: ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించిన భారత్.. 295కే ఆసిస్ ఆలౌట్
Also Read : మొత్తానికి అసలు బాయ్ ఫ్రెండ్ ఎవరో బయటపెట్టిన రష్మిక..!