Rashmika Mandanna
Rashmika Mandanna: రష్మిక - విజయ్ దేవరకొండ.. వీరిద్దరూ ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ రెండింటిలో సూపర్ బాండింగ్ మైంటైన్ చేస్తుంటారు. అప్పుడుడప్పుడు ఈ జంట ఒకేచోట కలిసి కనిపిస్తూ నెట్టింట హాట్ టాపిక్ గా నిలుస్తుంటారు. అయితే కొంతకాలంగా వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. విజయ్ వెకేషన్ కి వెళ్లే ప్లేస్ కు రష్మిక కూడా వెళ్లడం, విజయ్ ఇంట్లోనే పండగలు జరుపుకోవడం లాంటివి ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది. ఇటీవలే మరో సారి వీళ్ళిద్దరూ ఓ రెస్టారెంట్ లో కలిసి ఉన్న ఫొటో నెట్టింట తెగ వైరలైంది. పైకి ఈ జంట ఫ్రెండ్స్ అని చెబుతున్నా.. సీక్రెట్ రిలేషన్ మైంటైన్ చేస్తున్నారని టాక్.
Also Read: నవ్వులు పూయిస్తున్న 'సారంగపాణి జాతకం' టీజర్.. ప్రియదర్శి కామెడీ టైమింగ్ అదుర్స్
అతడెవరు మీకు తెలుసు..
ఇక ఈ ఊహాగానాల మధ్య తాజాగా చెన్నై లో జరిగిన పుష్ప 2 వేడుకలో రష్మిక చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. ఈవెంట్లో యాంకర్.. మీకు ఇష్టమైన వ్యక్తి ఎవరు..? అతడు ఇండస్ట్రీ చెందిన వాడేనా..? అని అడగగా .. దానికి రష్మిక అతడెవరో మీకు తెలుసు అంటూ బదులిచ్చింది. దీంతో ఇన్నాళ్లుగా విజయ్ దేవరకొండతో రిలేషన్ షిప్ పై క్లారిటీ ఇచ్చినట్లుగా మాట్లాడింది. మరోవైపు విజయ్ దేవరకొండ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పెళ్లి గురించి ప్రశ్నించగా.. ఇంకా సింగిల్‌గా ఉండమంటారా..? ఏదో ఒకటైంలో పెళ్లి చేసుకోవాల్సిందే అంటూ చెప్పాడు. దీంతో త్వరలో వీరిద్దరూ పెళ్లి వార్త చెప్పే అవకాశంలేకపోలేదని అనుకుంటున్నారు నెటిజన్లు.
Also Read: ఎట్టకేలకు బయటపడ్డ విజయ్ - రష్మిక సీక్రెట్ రిలేషన్.. ఒక్క ఫొటోతో క్లారిటీ
Also Read: Allu Arha: నా 8ఏళ్ల ఆనందం.. కూతురు బర్త్‌డే సందర్భంగా అల్లు అర్జున్ విషెస్ వైరల్!
Also Read: రూ.1200కోట్ల సినిమా మిస్ చేసుకున్న సామ్.. అందులో హీరో ఎవరో తెలుసా..!
Follow Us