కేసీఆర్, కేటీఆర్ లో అరెస్ట్ అయ్యేదెవరు? ఆ రూల్స్ పాటించాల్సిందేనా?

కేసీఆర్, కేటీఆర్ ఎవరో ఒకరు అరెస్ట్ కావడం ఖాయమన్న ప్రచారం తెలంగాణల జోరుగా సాగుతోంది. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో కేటీఆర్ చుట్టు ఉచ్చు బిగుసుకుంటుండగా.. విద్యుత్ కొనుగోళ్లు, కాళేశ్వరం వ్యవహారంలో కేసీఆర్ కు ఇబ్బంది తప్పదన్న చర్చ సాగుతోంది.

KCR KTR
New Update

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కేసీఆర్ కుటుంబం అవినీతిని కక్కిస్తాం.. వాళ్లను జైళ్లలో పెడతాం.. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేతలు అనేక సార్లు చేసిన వ్యాఖ్యలు ఇవి. ఇందిరమ్మ రాజ్యంలో తప్పు చేసిన ఎవరినైనా వదిలిపెట్టం.. అది చిన్న దొరనైనా, పెద్దదొరనైనా.. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిన్న చేసిన కామెంట్స్. ధరణిని అడ్డుపెట్టకుని కేసీఆర్ భూకబ్జాలు చేశాడని కూడా పొంగులేటి ఆరోపించారు. అయితే.. గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు, ప్రభుత్వం తీసుకుంటున్న స్టెప్స్ చూస్తే కేసీఆర్ కుటుంబంలో అరెస్టులు ఖాయమన్న ప్రచారం సాగుతోంది. అయితే.. ఇటీవల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సియోల్ పర్యటనలో రాష్ట్రంలో పొలిటికల్ బాంబులు పేలబోతున్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో అప్పటి నుంచి బీఆర్ఎస్ ముఖ్యనేతల అరెస్టులపై జోరుగా ఊహాగానాలు వస్తున్నాయి. అయితే.. పొంగులేటి చెప్పినట్లుగా దీపావళిలోగా ఎలాంటి అరెస్టులు జరగలేదు. కానీ అరెస్ట్ దిశగానే పరిణామాలు జరుగుతున్నట్లు స్పష్టం అవుతోంది.
Also Read: బీజేపీలోకి హరీష్ రావు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

ఇటీవల పవర్ కమిషన్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఇందులో గత ప్రభుత్వ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఖజానాకు తీవ్ర నష్టం వాటిల్లిందని ఆ నివేదికలో కమిషన్ పేర్కొంది. ఇంకా కాళేశ్వరంపై ఏర్పాటు చేసిన కమిషన్ విచారణ అంతా కేసీఆర్ చుట్టే జరిగింది. కేసీఆర్ సూచనల మేరకే డిజైన్ చేశామని ఇంజనీర్లు కమిషన్ కు చెప్పారు. ఇంకా నిబంధనలు పాటించలేదని కూడా విచారణలో తేలినట్లు తెలుస్తోంది. ఇంకా తనిఖీలు కూడా చేయలేదని వెల్లడైంది. దీంతో కాళేశ్వరం కూడా కేసీఆర్ కే చుట్టుకునే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది. ఇంకా ఫార్ముల-ఈ రేసులో కేటీఆర్ పై కేసు నమోదు చేయడానికి ఇప్పటికే గవర్నర్ అనుమతిని కోరింది ఏసీబీ. దీంతో కేటీఆర్ అరెస్ట్ కు రంగం సిద్ధమైందన్న ప్రచారం సాగుతోంది. ఒకటి రెండు రోజుల్లోనే ఆయన అరెస్ట్ చేస్తారన్న ఊహాగానాలు పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది.
Also Read: Yadadri Temple Name Change: సీఎం రేవంత్ సంచలనం.. యాదాద్రి పేరు మార్పు!

ఈ నేపథ్యంలో కేటీఆర్ సైతం తన మలేషియా పర్యటనను రద్దు చేసుకున్నారు. తాను హైదరాబాద్ లోనే ఉన్నానని.. ఏ విచారణ సంస్థ అయినా రావొచ్చని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తన అరెస్ట్ కోసం ఉవ్విళ్లూరుతున్న రేవంత్ రెడ్డికి.. మెఘా కృష్ణారెడ్డిని అరెస్ట్ చేసే దమ్ముందా? అని ట్వీట్ చేశారు. నిన్న మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. తనను అరెస్ట్ చేస్తే రెండు నెలలు జైల్లో ఉండి మరింత ట్రిమ్ అవుతానన్నారు. మంచిగా యోగా చేసి వచ్చి పాదయాత్ర చేస్తానన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలను పరిశీలిస్తే ఆయన కూడా జైలుకు వెళ్లడానికి మానసికంగా సిద్ధమైనట్లు తెలుస్తోంది.

కేసీఆరా? కేటీఆరా?

ఫార్ములా ఈ కేసు వ్యవహారంలో కేటీఆర్ పై కేసు చుట్టూ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే ఆయన అరెస్ట్ ఖాయమన్న సంకేతాలు వస్తున్నా.. నిన్న పొంగులేటి వ్యాఖ్యలతో కేసీఆర్ కు కూడా ఇబ్బంది తప్పదన్న ప్రచారం మొదలైంది. కేటీఆర్ పై కేసు నమోదుకు ఏసీబీ ఇప్పటికే గవర్నర్ అనుమతిని కోరింది. అయితే.. కేసీఆర్ కు సంబంధించి అయితే ఇప్పటికైతే ఎలాంటి అనుమతి అడగలేదు. అయితే.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అవినీతి కేసుల్లో ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరూ అరెస్ట్ కాలేదు. దీంతో కేసీఆర్, కేటీఆర్ అరెస్ట్ అయితే తెలంగాణ రాష్ట్రంలో అవినీతి కేసుల్లో అరెస్ట్ అయిన తొలి ముఖ్యమంత్రి, మంత్రిగా ఉంటారన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.

Also Read: 'సిటాడెల్' లో సెమీ న్యూడ్ సీన్స్ పై నెటిజన్ షాకింగ్ కామెంట్.. వరుణ్ రిప్లై వైరల్..!

సెక్షన్ 17 ఏ ప్రకారం ఇలా చేయాల్సిందే..


కేసీఆర్ ఇప్పుడు గజ్వేల్ ఎమ్మెల్యేగా ఉన్నారు. కేటీఆర్ సిరిసిల్ల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో వీరిద్దరిలో ఎవరిని అరెస్ట్ చేయాలన్నా ముందుగా స్పీకర్ కు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది.‘సెక్షన్‌ 17 ఏ’ ప్రకారం పబ్లిక్ సర్వెంట్స్ విధులు నిర్వర్తించేటప్పుడు, నిర్ణయాలు తీసుకునే సమయంలో జరిగిన అవకతవకలపై అరెస్ట్ చేయాల్సి వస్తే గవర్నర్ కు తప్పనిసరిగా సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోకే కేటీఆర్ పై కేసుకు సంబంధించి గవర్నర్ ను అనుమతి కోరింది ఏసీబీ. చంద్రబాబును ఏపీ సీఐడీ చంద్రబాబును అరెస్ట్ చేసిన సమయంలో గవర్నర్ ను సమాచారం అందించకపోవడంతో కేసును క్వాష్ చేయాలని ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 

Also Read: తెలంగాణలో ఇకపై సాగు భూముల రిజిస్ట్రేషన్ డిప్యూటీ తహసిల్దార్లకేనా?

#ktr #kcr #revanth-reddy #minister-ponguleti
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe