'సిటాడెల్' లో సెమీ న్యూడ్ సీన్స్ పై నెటిజన్ షాకింగ్ కామెంట్.. వరుణ్ రిప్లై వైరల్..! 'సిటాడెల్'లో వరుణ్ ధావన్ సెమీ న్యూడ్‌గా కనిపించడంపై ఓ నెటిజన్ కామెంట్‌కు వరుణ్ రిప్లై వైరల్‌గా మారింది. ''ప్రతీ దర్శకుడు వరుణ్ ను నగ్నంగా చూపిస్తున్నారు''అని కామెంట్ చేయగా.. దానికి వరుణ్ ''నేను పూర్తిగా కూడా డ్రెస్ వేసుకున్నాను..అది కూడా చూడండి'' అని నవ్వుతూ రిప్లై ఇచ్చాడు. By Archana 08 Nov 2024 in సినిమా Latest News In Telugu New Update citadel series షేర్ చేయండి Varun Dhawan: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత- బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త స్పై యాక్షన్ ఎంటర్ టైనర్ 'సిటాడెల్'. 'ఫ్యామిలీ మెన్' డైరెక్టర్స్ రాజ్ అండ్ డీకే తెరకెక్కించిన ఈ సీరీస్ నవంబర్ 7 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. మంచి రెస్పాన్స్ కూడా వస్తోంది. Also Read: 3 స్టేట్స్.. 9 థియేటర్స్.. రామ్‌చరణ్ టీజర్ లాంచ్ ప్లాన్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వడం పక్కా భయ్యా! న్యూడ్ సీన్స్ పై వరుణ్ రిప్లై అయితే ఈ సీరీస్ లోని ఓ ఎపిసోడ్ లో వరుణ్ ధావన్ సెమీ న్యూడ్‌గా కనిపించడం పై ఓ నెటిజన్ సరదాగా చేసిన కామెంట్.. దానికి వరుణ్ రిప్లై నెట్టింట వైరల్ గా మారింది. సీరీస్ లో వరుణ్ సెమీ న్యూడ్ సన్నివేశం గురించి ఓ అభిమాని ఇలా కామెంట్ పెట్టాడు. "ఇప్పటి వరకు 'సిటాడెల్' లో మూడు ఎపిసోడ్స్ చూశాను.. సీరీస్ చాలా బాగుంది. సమంత, వరుణ్ ఇద్దరూ యాక్షన్ తో అదరగొడుతున్నారు. కానీ, వరుణ్ ను చూస్తేనే బాధగా ఉంది. ప్రతీ దర్శకుడు అతన్ని నగ్నంగా చూపిస్తున్నారు'' అంటూ కామెంట్ పెట్టాడు. దీనికి వరుణ్.. ''ఈ మొత్తం సీరీస్ లో నేను ఎక్కువ శాతం పూర్తిగా డ్రెస్ వేసుకొని ఉన్నాను.. అది కూడా చూడండి'' అంటూ నవ్వుతున్న ఎమోజీలతో రిప్లై ఇచ్చాడు. ఈ సీరీస్ లో కే మీనన్, సిమ్రాన్, సాకిబ్ సలీమ్, సికందర్ ఖేర్, సోహమ్ మజుందార్, శివన్‌కిత్ పరిహార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. Also Read: మాటలకు కొత్త పుంతలు తొక్కించాడు.. టాలీవుడ్ మనసును గెలిచాడు.. మాటల మాంత్రికుడి బర్త్ డే స్పెషల్! Also Read: Bigg Boss: బిగ్ బాస్ హౌస్ లో రచ్చ రచ్చ.. కొట్టుకున్న నబీల్- పృథ్వీ..! కంటెస్టెంట్స్ షాక్ #honey bunny citadel మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి