తెలంగాణలో ఇకపై సాగు భూముల రిజిస్ట్రేషన్ డిప్యూటీ తహసిల్దార్లకేనా?

తెలంగాణలో సాగు భూముల రిజిస్ట్రేషన్‌ను ఇకపై డిప్యూటీ తహసిల్దార్లకు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. తహసిల్దార్లు మండలాల్లో పర్యటించడం వల్ల వారిపై పని భారం, ఒత్తిడి తగ్గించడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

New Update
PM Kisan Update : రైతులకు అలెర్ట్.. పీఎం కిసాన్‌ 17వ నిధుల విడుదలపై కీలక్‌ అప్‌డేట్‌!

తెలంగాణలో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ఇక నుంచి నాయిబ్ తహసీల్దార్లకు ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో తెలంగాణ పట్టాదారు పాస్ పుస్తకాలు, యాజమాన్య హక్కుల చట్టం 2020 అమల్లో ఉంది. దీని ప్రకారం వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ అధికారం కేవలం తహసీల్దార్లకు మాత్రమే ఉంది. అయితే దీని స్థానంలో ప్రభుత్వం ఆర్వోఆర్-2024 చట్టం తీసుకురానుంది. ఈ చట్టంలో నాయిబ్ తహసీల్దార్లకు అధికారం ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చూడండి: Medak District: కానిస్టేబుల్ కొట్టాడని మనస్తాపంతో.. ఏం చేశాడంటే?

తహసీల్దార్లపై పని భారం తగ్గుతుందని..

దీనిపై అన్ని అభిప్రాయాలను కూడా అధికారులు క్రోడీకరించి సీఎం రేవంత్ రెడ్డికి ఇచ్చారు. నాయిబ్ తహసీల్దార్లు అయితే కేవలం కార్యాలయ వ్యవహారాలు మాత్రమే చూసుకుంటారు. అదే తహసీల్దార్లు అయితే మండలాల్లో పర్యటన, ఇంకా ఇతర బాధ్యతలు ఉండటం వల్ల ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అందుకే నాయిబ్ తహసీల్దార్లుకు వ్యవసాయ భూములు రిజిస్టేషన్ బాధ్యతలు అప్పగిస్తే తహసీల్దార్లపై కాస్త పని భారం కూడా తగ్గితుందని ప్రభుత్వం భావిస్తోంది.

 ఇది కూడా చూడండి: నేటి నుంచి దక్షిణాఫ్రికాతో T20 సిరీస్.. యువ ఆటగాళ్లు రాణిస్తారా?

ఇదే కాకుండా అప్పీల్ చేసుకునే వ్యవస్థను కూడా తీసుకురావాలని ప్రభుత్వం చూస్తోంది. పాత రెవెన్యూ విధానంలో ఉన్న జాయింట్ కలెక్టర్ల వ్యవస్థను మళ్లీ కొత్తగా పునరుద్ధరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే మొత్తం 40 మంది స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లకు సెలక్షన్ గ్రేడ్ ఇచ్చింది. ఆర్డీవో పరిధిలో అప్పీల్ 1, జేసీ లేదా కలెక్టర్ పరిధిలో అప్పీల్ 2 ఉండాలని తహసీల్దార్లు కోరుతున్నారు.

ఇది కూడా చూడండి: టెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం

కానీ కలెక్టర్ లేదా జేసీ పరిధిలో అప్పీల్ అధికారాన్ని కొత్త చట్టంలో ఉంచాలని నిర్ణయం తీసుకోకున్నట్లు తెలుస్తోంది. అయితే కొత్త చట్టం ప్రకారం అయితే తప్పకుండా వీలునామాలు, వారసత్వ పంపకాలు చేసేటప్పుడు  తప్పకుండా తహసీల్దారు విచారణ ఉండాలని భావిస్తున్నారు. 

ఇది కూడా చూడండి: KCR: కేసీఆర్ సర్కార్ చేసిన తప్పులివే.. విద్యుత్ కమిషన్ సంచలన నివేదిక!

Advertisment
Advertisment
తాజా కథనాలు