Bandi Sanjay: బీజేపీలోకి హరీష్ రావు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

TG: హరీష్ రావు త్వరలో బీజేపీలో చేరుతారంటూ జరుగుతున్న చర్చపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ‌లోకి హరీష్ రావు వస్తానంటే తీసుకోవడం.. తన ఒక్కడి నిర్ణయం కాదని అన్నారు. తమది ఎక్ నిరంజన్ పార్టీ కాదని... పార్టీలో అంత కలిసి నిర్ణయం తీసుకోవాలన్నారు.

New Update
Bandi Sanjay: హిందువులపై కుట్ర జరుగుతోంది.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Bandi Sanjay: కేంద్ర మంత్రి బండి సంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్, సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు కాంప్రమైజ్ అయ్యారని ఆరోపించారు. అందుకే మొన్నటి జన్వాడ కేసును గాలికి వదిలేశారని అన్నారు. రేవంత్ తో కేటీఆర్ ములాకత్ రాజకీయాలు నడిపిస్తున్నారని అన్నారు. తెలంగాణలో యాక్టివ్ సీఎం కేటీఆర్ అని వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్- కాంగ్రెస్ ఒక్కటై బీజేపి నీ మీడియా లో లేకుండా చూస్తున్నారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీలో ఆ పార్టీ గురించి ఆలోచించే వారెవరూ లేరని అన్నారు. 

Also Read: సీఎం రేవంత్ సంచలనం.. యాదాద్రి పేరు మార్పు!

కేసిఆర్ ఎందుకు ఫోన్ చేశారు?...

కాంగ్రెస్ ను గద్దె దింపే దమ్ము బీఆర్ఎస్ కు లేదని అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉంటారో పోతారో అనే బయం కేటీఆర్ కు  ఉందని అన్నారు. ప్రజా సమస్యల మీద స్పందించని కేసిఆర్.. కేటీఆర్ బామ్మర్ది అరెస్ట్ అయితే అధికారులకు ఫోన్ చేస్తారా? అని నిలదీశారు. కేటీఆర్ బామ్మర్ది మీద కేసు అయితే ఎమ్మెల్యేలు అంత వెళ్తారు.. కానీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల పై కేసు నమోదు అయితే మాత్రం వారిని పరమర్శించారని మండిపడ్డారు. 

Also Read: కేసీఆర్, కేటీఆర్ లో అరెస్ట్ అయ్యేదెవరు? ఆ రూల్స్ పాటించాల్సిందేనా?

బీజేపీలోకి హరీష్?...

బీఆర్ఎస్ లో హరీష్ రావు ఎంతో కొంత క్రిడిబులిటీ కలిగిన నాయకుడని ప్రశంసలు కురిపించారు బండి సంజయ్. కేటీఆర్ అహంకారి అని ఫైర్ అయ్యారు. అక్రమంగా సంపాదించిన డబ్బు వల్లే కేటీఆర్ కు అహంకారం పెరిగిందని అన్నారు. త్వరలో హరీష్ రావు బీజేపీలో చేరుతారంటూ ప్రచారం జారుతుందంటూ ఆర్టీవీ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు... బీజేపీ లోకి హరీష్ రావు వస్తానంటే తీసుకోవడం ...తన ఒక్కడి నిర్ణయం కాదని అన్నారు. తమది ఎక్ నిరంజన్ పార్టీ కాదని... పార్టీలో అంత కలిసి నిర్ణయం తీసుకోవాలని బండి సంజయ్ సమాధానం ఇచ్చారు.

Also Read: సెలూన్, టైలర్స్ కు బిగ్ షాక్.. మహిళలను టచ్ చేస్తే జైలుకే!

Also Read: మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డికి బిగ్ షాక్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు