CM Revanth Reddy: తన పుట్టిన రోజు సందర్భంగా ఈరోజు యాదాద్రిలో లక్ష్మి నరసింహ స్వామిని దర్శించుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అనంతరం యాదాద్రి అధికారుతో సమీక్ష నిర్వహించారు. ఇక నుంచి యాదాద్రి బదులుగా అన్ని రికార్డుల్లో యాదగిరిగుట్టగా వ్యవహారికంలోకి తీసుకురావాలని అధికారులను సీఎం ఆదేశించారు. యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అధికారులకు స్పష్టం చేశారు.
Also Read: వేణు స్వామికి మరోసారి నోటీసులు.. షాకిచ్చిన మహిళా కమీషన్!
టీటీడీ తరహాలో..
టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఉండేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు చెప్పారు. గతంలో కొండపై నిద్ర చేసేందుకు భక్తులకు అవకాశం ఉండదని గుర్తు చేశారు. కొండపై నిద్ర చేసి మొక్కులు తీర్చుకునేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం ఇచ్చారు. విమాన గోపురానికి బంగారు తాపడం పనులను వేగవంతం చేయాలని అన్నారు. బ్రహ్మోత్సవాల నాటికి బంగారు తాపడం పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
Also Read: కులాంతర వివాహాలపై డేటా అందుకే సేకరిస్తున్నాం.. రేవంత్ కీలక ప్రకటన
ఆలయ అభివృద్ధికి సంబంధించి పెండింగ్ లో ఉన్న భూసేకరణను పూర్తి చేయాలని చెప్పారు. అందుకు అవసరమైన నిధులను మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆలయానికి సంబంధించి పెండింగ్ పనులు పూర్తి చేయాల్సిందేనని స్పష్టం చేశారు. మరో వారంరోజుల్లో పూర్తి వివరాలు, ప్రపోజల్స్ తో రావాలని తేల్చి చెప్పారు. ఆలయానికి సంబంధించి అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. పెండింగ్ పనులు, ఇతర అంశాలపై పూర్తిస్థాయి రిపోర్ట్ అందించాలని అన్నారు.
Also Read: మోదీ నుంచి చంద్రబాబు వరకు రేవంత్‌కు విషెస్ వెల్లువ!
Also Read: పడి లేచిన కెరటం రేవంత్‌రెడ్డి.. జడ్పీటీసీ టూ సీఎం.. ఆయన సక్సెస్ కు కారణం ఇదే..!