Revanth Reddy: కులాంతర వివాహాలపై డేటా అందుకే సేకరిస్తున్నాం.. రేవంత్ కీలక ప్రకటన రిజర్వేషన్ల ఫలాలు నష్టపోకుండా ఉండేదుకే కులగణనలో కులాంతర వివాహాలకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రిజర్వేషన్లకు 50 శాతం ఉన్న లిమిట్ ను బద్దలు కొట్టబోతున్నామన్నారు. బీసీ రిజర్వేషన్లను భారీగా పెంచుతామన్నారు. By Nikhil 08 Nov 2024 in తెలంగాణ రాజకీయాలు New Update షేర్ చేయండి కుల గణనలో కులాంతర వివాహాలకు సంబంధించిన వివరాలు సేకరించడంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ రోజు ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన క్లారిటీ ఇచ్చారు. అగ్రవర్ణాల వ్యక్తి దళితుడు లేదా మరే ఇతర కులానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకున్న సమయంలో రిజర్వేషన్లకు సంబంధించి ఇబ్బంది తలెత్తకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. వివాహం చేసుకున్న తర్వాత కూడా వారు ఈ రిజర్వేషన్ ప్రయోజనం పొందాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. ఇలాంటి సామాజిక మార్పులను ప్రభుత్వం ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. కులాంతర వివాహాలను సమాజానికి సానుకూల దశగా తాను చూస్తున్నానన్నారు. కులవివక్ష నిర్మూలనకు ఇది దోహదపడుతుందన్నారు. వెనుకబడిన తరగతులకు సాధ్యమైనంత మేలు చేశాల అన్ని కోణాల్లో వివరాలను సేకరిస్తున్నామన్నారు. ఆయా కులాలకు సహాయం చేసేందుకు ప్రభుత్వానికి డేటా అవసరం అన్నారు. కులగణన తర్వాత రిజర్వేషన్లకు 50 శాతం లిమిట్ రూల్ ను బద్దలు కొట్ట బోతున్నామన్నారు. దీంతో బీసీ రిజర్వేషన్లు పెరగబోతున్నాయన్నారు. Also Read : పడి లేచిన కెరటం రేవంత్‌రెడ్డి.. జడ్పీటీసీ టూ సీఎం.. ఆయన సక్సెస్ కు కారణం ఇదే..! దక్షిణాది హక్కులను కాపాడాలి.. కేంద్రంపై పోరాడడానికి తాను దక్షిణాది ముఖ్యమంత్రులందరినీ కలుస్తున్నానన్నారు. పన్నుల రూపంలో మనం కేంద్రానికి ఎంత చెల్లిస్తున్నాం.. ఎంత తిరిగి పొందుతున్నాం అనే సమాచారాన్ని సేకరించాలని అధికారులను ఆదేశించానన్నారు. డీలిమిటేషన్‌కు 2026 కటాఫ్ డేట్ అయినందున బీజేపీ దీన్ని ఎలా చేస్తోందో చూడాలన్నారు. దక్షిణాది రాష్ట్రాల ప్రజల హక్కులను కాపాడేలా నిబంధనలు తీసుకురావాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాబట్టి కేంద్రం నిబంధనలు సవరించాలన్నారు. Also Read : చిన్నప్పుడు స్టార్ హీరోలకు కూడా ఆ భాదలు తప్పలేదు..! చంద్రబాబుతో కలిసి పని చేశా.. కానీ.. ఎన్డీఏలో భాగంగా ఉన్న చంద్రబాబు ఇప్పుడు ఈ అంశంపై ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలన్నారు. చంద్రబాబుతో తాను గతంలో కలిసి పని చేశాన్నారు. అయితే.. ఇప్పడు తన వాదనలను అతడు అంగీకరిస్తాడని చెప్పలేమన్నారు. పరిస్థితి వస్తే ఈ అంశంపై పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడాల్సి వస్తుందేమో.. అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. Also Read : దేశానికి ఎల్‌కే అద్వానీ చేసిన సేవలు అనంతం జనభా ప్రకారం పునర్విభజన వద్దు.. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారన్నారు. జనగణన జనవరి 2025 నుండి ప్రారంభమవుతుందన్నారు. భారత ప్రభుత్వం జనాభా ఆధారంగా నియోజకవర్గాల విభజన ప్రారంభిస్తే.. దాన్ని ఆపాల్సిన అవసరం ఉందన్నారు. రాహుల్ గాంధీ కూడా లోక్‌సభలో ఈ అంశాలను లేవనెత్తారన్నారు. Also Read : ఈసారి ట్రూడో ఇంటికి పోవడం గ్యారెంటీ: ఎలాన్ మస్క్ కేశవాపురం రద్దు అందుకే.. హైదరాబాద్‌కు నీళ్లిచ్చే కేశవాపురం పథకాన్ని రద్దుపై కూడా రేవంత్ క్లారిటీ ఇచ్చారు. అది అవసరం లేదని, ప్రత్యామ్నాయం తక్కువ ధరకు వస్తుందన్నారు. ఇకపై మల్లన్న సాగర్ నుంచి నీళ్లు తీసుకుంటామన్నారు. కేశవాపూర్ నుంచి ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్‌లోకి నీరు వస్తే లీటరు నీటికి రూ.48 ఖర్చు అవుతుందన్నారు. అదే.. మల్లన్న సాగర్ నుంచి తీసుకుంటే కేవలం రూ.4 మాత్రమే ఖర్చు అవుతుందన్నారు. కేశవాపూర్ నుంచి నీరు రావాలంటే ఐదుసార్లు ఎత్తిపోయాల్సి ఉంటుందన్నారు. మల్లన్న సాగర్ నుంచి రెండు లిఫ్టులు చాలన్నారు. మల్లన్న సాగర్‌లో ఎక్కువ నిల్వ సామర్థ్యం ఉన్నందున డెడ్ స్టోరేజీ నుంచి నీటిని తీసుకోవచ్చన్నారు. #caste sensus in telangana #reservations #revanth-reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి