ఏడాదిలో 5 ప్రభుత్వ ఉద్యోగాలు.. శిరీషను అభినందించిన సీఎం రేవంత్!

జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఏడాది కాలంలోనే అయిదు ఉద్యోగాలను సాధించిన ఖమ్మం జిల్లా మిట్టపల్లి గ్రామానికి చెందిన జంగం జ్యోతి శిరీషను సీఎం రేవంత్ అభినందనలు తెలియజేశారు. భవిష్యత్తులో మరిన్ని శిఖరాలు అధిరోహించాలని సీఎం ఆకాంక్షించారు.  

New Update
cm-revanth-reddy, shirisha

cm-revanth-reddy, shirisha

ఒకపక్కా అనారోగ్యంతో బాధపడుతూనే ఏడాదిలో ఏకంగా ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన ఖమ్మం జిల్లాకు చెందిన జ్యోతి శిరీషను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు.ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఏడాది కాలంలోనే అయిదు ఉద్యోగాలను సాధించిన ఖమ్మం జిల్లా మిట్టపల్లి గ్రామానికి చెందిన జంగం జ్యోతి శిరీషను సీఎం రేవంత్ అభినందనలు తెలియజేశారు. రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం నుంచి, అందులోనూ రక్తహీనత పెడుతున్న బాధను లెక్కచేయకుండా జీవితంలో విజయం సాధించాలన్న శిరీష పట్టుదల నేటి కాలంలో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తారని సీఎం అన్నారు.  

Also read :  తన ఇంటి కరెంట్ బిల్లుపై ఎంపీ కంగనా రచ్చ..క్లారిఫై చేసిన విద్యుత్ శాఖ

Also Read :  Manchu Manoj: వీడు కన్నప్ప కాదు 'దొంగప్ప'.. మంచు మనోజ్ సంచలన ట్వీట్!

శిరీష ఆత్మవిశ్వాసం గొప్పది

జీవితంలో అనుకున్నది సాధించడానికి, అవరోధాలను లెక్కచేయకుండా, ఎక్కడా ఢీలా పడకుండా ముందడుగు వేసిన చిరంజీవి శిరీష ఆత్మవిశ్వాసం గొప్పదని అన్నారు. ఈ ప్రయాణంలో తల్లిదండ్రులతో పాటు ప్రోత్సహించిన వారు అభినందనీయులు. ప్రజా ప్రభుత్వ కొలువుల పండుగలో ముందడుగు వేసిన శిరీష భవిష్యత్తులో మరిన్ని శిఖరాలు అధిరోహించాలని ఈ సందర్భంగా సీఎం రేవంత్ ఆకాంక్షించారు.  

Also read : Mayawati : మాయావతి మేనకోడలకు వరకట్న,లైంగిక వేధింపులు..!

Also read : ఇది మామూలు ప్లానింగ్ కాదు భయ్యా.. అమెజాన్ ఆర్దర్లతో పగ మాజీ గర్ల్ ఫ్రెండ్ పై ప్రతీకారం!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు