Mayawati : మాయావతి మేనకోడలకు వరకట్న,లైంగిక వేధింపులు..!

బీఎస్పీ అధినేత్రి మాయావతి మేనకోడలు వరకట్న వేధింపుల కేసు నమోదు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆమె ఫిర్యాదుతో హాపూర్ జిల్లాలో తన భర్త, అత్త, మున్సిపల్ కౌన్సిల్ చైర్‌పర్సన్, మామ సహా తొమ్మిది మందిపై వరకట్న వేధింపుల కేసు నమోదైంది.

New Update
Mayawati niece

Mayawati niece

బీఎస్పీ అధినేత్రి మాయావతి మేనకోడలు వరకట్న వేధింపుల కేసు నమోదు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆమె ఫిర్యాదుతో హాపూర్ జిల్లాలో తన భర్త, అత్త, మున్సిపల్ కౌన్సిల్ చైర్‌పర్సన్, మామ సహా తొమ్మిది మందిపై వరకట్న వేధింపుల కేసు నమోదైంది. బాధితురాలు తన భర్త విశాల్, అత్తగారు పుష్పా దేవి, మామ శ్రీపాల్ సింగ్ తో సహా  మరో నలుగురు బంధువుల పేర్లను ఫిర్యాదులో పేర్కొంది. పుష్పా దేవి హాపూర్ మున్సిపల్ కౌన్సిల్ చైర్‌పర్సన్ గా ఉన్నారు. బాధితురాలికి 2023నవంబర్ 09న విశాల్‌తో వివాహం జరిగింది. అయితే, వివాహం జరిగినప్పటి నుండి ఆమెను  పుష్పా దేవి కుటుంబం అదనపు కట్నం కోసం వేధించడం మొదలుపెట్టారు. బాధితురాలు కుటుంబం రాజకీయ పలుకుబడి ఉండటంతో బీఎస్పీ టికెట్ తో పాటుగా  రూ.50 లక్షల నగదు, కట్నంగా ఒక ఫ్లాట్ డిమాండ్ చేసింది.

లైంగిక వేధింపులకు ప్రయత్నించారు 

అంతేకాకుండా తన భర్త బాడీబిల్డింగ్ కోసం స్టెరాయిడ్లు వాడాడని, దీనివల్ల అతను వైవాహిక జీవితానికి అనర్హుడని బాధితురాలు ఫిర్యాదులో ఆరోపించింది. తన భర్త వైద్య పరిస్థితి గురించి తన అత్తమామలను తెలుసునని..  కానీ వారు తన బావమరిది భూపేంద్ర అలియాస్ మోనుతో తనకు బిడ్డ పుట్టించాలని తనకు  సూచించారని ఆమె ఆరోపించింది.  2025 ఫిబ్రవరి 17న తన మామ, బావమరిది తనపై లైంగిక వేధింపులకు ప్రయత్నించారని ఆమె ఆరోపించింది.  దీంతో తాను తన తల్లిదండ్రుల ఇంటికి తిరిగి వచ్చానని.. మొదట్లో  పోలీసు ఫిర్యాదు చేసినప్పటికీ, ఎటువంటి చర్య తీసుకోలేదని, కాబట్టి తాను కోర్టును ఆశ్రయించానని బాధితురాలు తెలిపింది.  ఏప్రిల్ 9న చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ డాక్టర్ బ్రహ్మపాల్ సింగ్ ఆదేశాల మేరకు, మరుసటి రోజు హాపూర్ నగర్ కొత్వాలిలో ఎఫ్ఐఆర్ నమోదు చేయబడిందని పోలీసు అధికారి మునీష్ ప్రతాప్ సింగ్ తెలిపారు. తదుపరి దర్యాప్తు జరుగుతోందని, తగిన చర్యలు తీసుకుంటామని సింగ్ తెలిపారు. ఈ కేసు వెలుగులోకి రావడంతో పుష్పా దేవితో పాటుగా ఆమె కుటుంబబీకుల్నీ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ బీఎస్పీ నిర్ణయం తీసుకుంది.  

Also Read :  Alahabad: అత్యాచారం చేయడానికి కారణం ఆమే..అలహాబాద్ హైకోర్టు మరో సంచలన తీర్పు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు