కలెక్టర్ల పనితీరుపై సీఎం రేవంత్ వద్ద రిపోర్టు.. వాళ్లపై సీరియస్

తెలంగాణలో కలెక్టర్ల పనితీరుపై రేవంత్ సర్కార్ ఫోకస్ పెట్టింది. వాళ్ల పనితీరుపై ఇప్పటికే సీఎం రేవంత్ రిపోర్ట్‌ను తెప్పించుకున్నారు. సరిగా పనిచేయని కలెక్టర్లపై చర్యలు తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

revanth3
New Update

తెలంగాణలో కలెక్టర్ల పనితీరుపై రేవంత్ సర్కార్ ఫోకస్ పెట్టింది. వాళ్ల పనితీరుపై ఇప్పటికే సీఎం రేవంత్ రిపోర్ట్‌ను తెప్పించుకున్నారు. ఎవరు ఎలా పనిచేస్తున్నారు.. ప్రజల పట్ల ఎవరు నిర్లక్ష్యం వహిస్తున్నారన్నేది ఆయన తెలుసుకున్నారు. ఇందులో పదిమంది కలెక్టర్ల పనీతురు అంతంతమాత్రంగా ఉన్నట్లు తేలింది. వీళ్లు ప్రజలకు అందుబాటులోకి ఉండటం లేదని.. సమస్యలతో కలెక్టరేట్ ఆఫీసుకు వస్తున్న బాధితులను కూడా కలవడం లేదని తెలిసింది. అలాగే ప్రభుత్వ పథకాలను కూడా ప్రజలకు చేరవేయడంలో ఈ కలెక్టర్లు నిర్లక్ష్యం చూపిస్తున్నారని తేలింది. మరికొందరు కలెక్టర్లు తమ బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తున్నట్లు సీఎం దృష్టికి వచ్చింది. 

Also Read: గ్రూప్-1 పరీక్ష కేంద్రం వద్ద ప్రమాదం

కొందరు యావరేజ్‌, మరికొందరు బిలో యావరేజ్

ఇక వివరాల్లోకి వెళ్తే.. రాష్ట్రంలో 33 జిల్లాలకు కలెక్టర్లు ఉన్నారు. వీళ్లలో గత మూడు నెలల నుంచి ఎవరు ఎలా పనిచేస్తున్నారనే వివరాలను ప్రభుత్వం సేకరించింది. 12 మంది కలెక్టర్లు అద్భతంగా పనిచేస్తున్నారని.. 11 మంది యావరేజ్‌గా పనిచేస్తున్నారని రిపోర్టులో తేలింది. అలాగే మరో 10 మంది బిలో యావరేజ్‌గా పనిచేస్తున్నట్లు వెల్లడైంది. ఈ నేపథ్యంలోనే ఈ అంశంపై త్వరలో కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో సీఎం రేవంత్ భేటీ కానున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో వీటి గురించి సీఎం చర్చించనట్లు తెలుస్తోంది. 

Also Read: గ్రూప్-1 పరీక్షపై టీపీసీసీ చీఫ్ మరో కీలక ప్రకటన.. అభ్యర్థులకు భరోసా!

పనితీరు మార్చుకునేందుకు ఛాన్స్

యావరేజ్‌, బిలో యావరేజ్‌ పనితీరు కనబరుస్తున్న కలెక్టర్లపై రేవంత్ సీరియస్‌గా ఉన్నట్లు తెలిసింది. వీళ్లపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రతీ సోమవారం జరిగే ప్రజావణి, ధరణి పెండింగ్ అప్లికేషన్ల అంశాలు, ఫీల్డ్‌ విజిట్లు, ఆరు గ్యారెంటీ పథకాల అమలు, ప్రజలకు అందుబాటులో ఉండటం వంటి అంశాలు కొందరు కలెక్టర్లు పట్టించుకోవడం లేదని ముఖ్యమంత్రి వద్దకు రిపోర్టు వచ్చింది. యావరేజ్, బిలో యావరేజ్ కలెక్టర్లకు ముందుగా పనితీరు మార్చుకునేందుకు ఛాన్స్ ఇస్తారని.. అయినా కూడా వాళ్లు మారకపోతే ఇక్కడి నుంచి తప్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  

Also Read :  ఇక్కడ 117 రోజులకు  ఒకసారి సూర్యోదయం

తెలంగాణ ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు అధికారుల పనితీరును ప్రభుత్వ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుందని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. కొంతమంది కలెక్టర్ల నిర్వాహకం వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని.. ఇటీవల రుణమాఫీ విషయంలో కూడా కొందరు కలెక్టర్లు సరిగ్గా స్పందించలేదనే విషయం సీఎం దృష్టికి వచ్చింది. ప్రజల పట్ల, పనిపట్ల నిర్లక్ష్యం వహిస్తున్న కలెక్టర్లు ఇతర పోస్టులకు వెళ్లిపోవచ్చని.. వాళ్ల స్థానంలో వేరే వాళ్లని తీసుకుంటామని రేవంత్ అన్నట్లు తెలుస్తోంది. ఒకటి రెండు నెలల్లో యావరేజ్, బిలో యావరేజ్ రేటింగ్ ఉన్న కలెక్టర్లు తమ పనీతీరు మార్చుకోవాలని.. లేకపోతే తామే చర్యలు తీసుకుంటామని రేవంత్ హెచ్చరించినట్లు తెలుస్తోంది. 

Also Read :  నాగ చైతన్య, శోభిత పెళ్లి సందడి షురూ.. వైరల్ అవుతున్న ఫొటోలు!

#telugu-news #telangana-news #revanth-reddy #collectors
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe