TGPSC Group-1: గ్రూప్-1 పరీక్ష కేంద్రం వద్ద ప్రమాదం

హైదరాబాద్ నాంపల్లి ఇందిరా ప్రియదర్శిని ప్రభుత్వ కళాశాలలో ఏర్పాటు చేసిన గ్రూప్-1 పరీక్ష కేంద్రం వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. అభ్యర్థుల కోసం ఏర్పాటు చేసిన బయో టాయిలెట్ బస్సు ప్రమాదానికి గురైంది. దీంతో కాలేజీ గేటు, గోడ ధ్వంసమైంది.

New Update
TGPSC Group-1 Exam Updates

తెలంగాణ వ్యాప్తంగా గ్రూప్-1 పరీక్ష ప్రశాంతంగా ప్రారంభమైంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన ఈ ఎగ్జామ్ 5 గంటల వరకు కొనసాగనుంది. అభ్యర్థుల ఆందోళనల నేపథ్యంలో పరీక్ష కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే.. ఒక్క నిమిషం ఆలస్యమైనా ఎగ్జామ్ సెంటర్లలోకి అనుమతించేది లేదన్న నిబంధనను టీజీపీఎస్సీ తీసుకువచ్చింది.

ఇది కూడా చదవండి: గ్రూప్-1 పరీక్షపై టీపీసీసీ చీఫ్ మరో కీలక ప్రకటన.. అభ్యర్థులకు భరోసా!

ఈ నిబంధనతో పలు సెంటర్ల వద్ద ఆలస్యగా వచ్చిన వారిని అధికారులు వెనక్కి పంపించారు. బేగంపేట ఉమెన్స్‌ కాలేజీ దగ్గర కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆలస్యంగా రావడంతో అభ్యర్థులను పోలీసులు అనుమతించలేదు. ఈ క్రమంలో లోపలికి అనుమతించాలంటూ వేడుకుంటూ ఓ మహిళ స్పృహ తప్పి పడిపోయింది. పడిపోయిన తల్లిని చూసి కుమారుడు కన్నీరు పెట్టుకున్నాడు.

ఇది కూడా చదవండి: Group-1:పరీక్ష జరిగినా రద్దు కావడం ఖాయం.. గ్రూప్-1 అభ్యర్థుల వాదన ఇదే!

నాంపల్లి ఎగ్జామ్ సెంటర్ వద్ద బస్సు బీభత్సం..

ఇదిలా ఉంటే.. నాంపల్లి ఇందిరా ప్రియదర్శిని ప్రభుత్వ కళాశాల వద్ద పరీక్ష రాయడానికి వచ్చే విద్యార్థుల కోసం బయో టాయిలెట్ బస్సును అధికారులు ఏర్పాటు చేశారు. అయితే.. డ్రైవర్ అజాగ్రత్తతో బస్సు నడపడంతో కాలేజీ గేటు, గోడ ధ్వంసమైంది. అయితే.. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Also Read :  ముదురుతున్న వివాదం.. మరోసారి గ్రూప్‌-1 వాయిదా!?

Also Read :  రైల్వేలో 8,113 ఎన్‌టీపీసీ గ్రాడ్యుయేట్ పోస్టులు.. కొద్ది గంటలే సమయం

Advertisment
Advertisment
తాజా కథనాలు