నాగ చైతన్య, శోభిత పెళ్లి సందడి షురూ.. వైరల్ అవుతున్న ఫొటోలు!

హీరో అక్కినేని నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల పెళ్లి సందడి ప్రారంభమైంది. గోధుమరాయితో పెళ్లి పనులు ప్రారంభమయ్యాయని క్యాప్షన్ ఇస్తూ.. శోభితా సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేసింది. ప్రస్తుతం ఇవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.

New Update
Shobitha

హీరో అక్కినేని నాగచైతన్య, నటి శోభిత ధూళిపాళ్ల పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఎంతోకాలంగా స్నేహితులుగా ఉన్న వీరు ఆగస్టు 8న నిశ్చితార్థం చేసుకున్నారు. తాజాగా వీరి పెళ్లి పనులు ప్రారంభమయ్యాయి. దీనికి సంబంధించిన ఫొటోలను శోభితా ధూళిపాళ్ల సోషల్ మీడియాలో షేర్ చేసింది. గోధుమరాయితో పెళ్లి పనులు ప్రారంభమయ్యాయని క్యాప్షన్ పెడుతూ ఫొటోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

ఇది కూడా చూడండి: విశ్వవిజేతులుగా కివీస్.. మొదటిసారి ప్రపంచ కప్ టైటిల్

ఎరుపు, గోధుమ రంగు శారీలో అందంగా..

తెలుగు ప్రజలు తప్పకుండా గోధుమరాయితో పెళ్లి పనులు ప్రారంభిస్తారు. అయితే ఈ కార్యక్రమం శోభితా ఇంట్లో జరిగినట్లు తెలుస్తుంది. ఈ ఫొటోల్లో నాగ చైతన్య, అమల, నాగార్జున అయితే లేరు. ఎరుపు, గోధుమ రంగులో ఉండే శారీలో శోభితా అందంగా కనిపిస్తోంది. చూడటానికి మహాలక్ష్మీలా చక్కగా ఉన్నావని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అలాగే పెళ్లి ఎప్పుడు, ఎక్కడ జరుగుతుందో చెప్పాలని ఆమెను కోరారు. 

ఇది కూడా చూడండి: మారథాన్‌లో సీఎం.. 2 గంటల్లో 21 కిలోమీటర్లు

ఇటీవల వీరిద్దరూ కలిసి ఉన్న ఫొటోను నాగచైతన్య సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయగా నెట్టింట తెగ వైరల్ అయ్యింది. బ్లాక్ అవుట్‌ఫిట్‌లో ట్రెండీ లుక్స్‌లో ఉన్న ఇద్దరు మిర్రర్ దగ్గర తీసుకున్న ఫొటో పోస్ట్ చేయగా.. వైరల్ అయ్యింది. అయితే ఈ పోస్ట్‌కి నాగచైతన్య కామెంట్ సెక్షన్ ఆఫ్ చేశారు.

ఇది కూడా చూడండి: మాస్ స్టెప్‌లతో డ్యాన్స్ అదరొగొట్టిన మాజీమంత్రి .. నెట్టింట వైరల్!

శోభితా ధూళిపాళ్ల, నాగ చైతన్య గత రెండేళ్ల నుంచి రిలేషన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో వీరి గురించి రూమర్స్ వచ్చిన కూడా పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. తెలుగమ్మాయి అయిన శోభితా ధూళిపాళ్ల 2013లో ఫెమినా మిస్‌ ఇండియా టైటిల్‌ విన్నర్‌గా గెలిచి, 2016లో సినీ  ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. టాలీవుడ్‌, బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్‌లో కూడా సినిమాలు చేస్తే బిజీగా ఉంటుంది. 

ఇది కూడా చూడండి: Frog: ట్రిపుల్‌ఐటీ మెస్‌ బిర్యానీలో కప్ప.. కాదు కాదు కప్ప బిర్యానీ!

 

Advertisment
Advertisment
తాజా కథనాలు