/rtv/media/media_files/2025/10/28/cm-revanth-key-announcement-on-film-workers-2025-10-28-18-53-39.jpg)
CM Revanth key Announcement on Film Workers
సినీ కార్మికులకు సీఎం రేవంత్ గుడ్‌న్యూస్ చెప్పారు. సినీ కార్మికుల సంక్షేమానికి ఒక వెల్ఫేర్ ఫండ్‌ను ఏర్పాటు చేసుకోవాలని కోరారు. ఈ సంక్షేమ నిధికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.10 కోట్లు అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే సినిమా నుంచి వచ్చే ఆదాయంలో కార్మికులకు 20 శాతం వాటా ఇవ్వాలని సినీ ఇండస్ట్రీకి సూచించారు. అంతేకాదు రాబోయే రోజుల్లో సినిమా టికెట్ల ధరలను పెంచాలనుకుంటే.. అందులో 20 శాతం వాటా సినీ కార్మికుల వెల్ఫేర్ ఫండ్‌కు ఇస్తేనే పర్మిషన్ ఇచ్చేలా జీవోలో నిబంధనలు సడలిస్తామని పేర్కొన్నారు.
Also Read: 15 మంది మహిళల న్యూడ్ వీడియోస్.. హత్య కేసులో సంచలన విషయాలు!
అలాగే నర్సరీ నుంచి 12వ తరగతి వరకు కార్పొరేట్ స్థాయిలో ఓ స్కూల్ నిర్మించి సినీ కార్మికుల పిల్లలకు చదువు చెప్పించే బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆరోగ్య శ్రీ ద్వారా ఉచిత వైద్య సౌకర్యం కల్పిస్తామని పేర్కొన్నారు. ఫ్యూచర్ సిటీలో సినీ ఫైటర్స్ ట్రైనింగ్‌కు స్థలం కేటాయిస్తామన్నారు. సినీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అభినందన సభ కార్యక్రమంలో సీఎం రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారు. తెలుగు సినీ ఇండస్ట్రీని హైదరాబాద్‌కు తరలించేందుకు ఆనాటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి తీవ్రంగా కృషి చేశారని పేర్కొన్నారు.
Also Read: ప్రతి ఇంటికి ప్రభుత్వ ఉద్యోగం.. మహాఘఠ్‌బంధన్ మేనిఫెస్టో విడుదల..
డా. ప్రభాకర్ రెడ్డి సినీ కార్మికుల కోసం మణికొండలో 10 ఎకరాల సొంత స్థలం ఇచ్చారని తెలిపారు.చిత్రపురి కాలనీ ఏర్పాటుకు ఎంతో కృషి చేశారన్నారు. చిత్ర పరిశ్రమలో కార్మికులు, కళాకారులు ఎంతో కష్టపడి పనిచేస్తున్నారని.. అందుకే దిల్ రాజుకు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా బాధ్యతలు అప్పగించానని తెలిపారు. కొన్నేళ్ల క్రితం నిలిపివేసిన నంది అవార్డుల స్థానంలో ప్రజా యుద్ధ నౌక గద్దర్ అవార్డులు ఇస్తున్నామని తెలిపారు. తెలంగాణ రైజింగ్ 2047 ప్రణాళికలో ఫిల్మ్ ఇండస్ట్రీకి ప్రత్యేక చాప్టర్ ఉంటుందన్నారు. నవంబర్ చివరి వారంలో సినీ కార్మికుల సమస్యలపై మరోసారి సమావేశమవుతామని పేర్కొన్నారు.
Also Read: ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. 8వ వేతన సంఘం నియమావళికి కేబినెట్ ఆమోదం
Follow Us